తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భదాద్రి కొత్తగూడెం మే 23 (తెలుగు వెలుగు ) : ప్రధానోపాధ్యాయులు ప్రభుత్వ విద్యా రంగాన్ని నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించాలని, వారు పాఠశాల నాయకులుగా ఉపాధ్యాయులకు అకాడమిక్ మార్గదర్శకత్వం వహిస్తూ విద్యార్థిని విద్యార్థుల పట్ల సానుకూల దృక్పథంతో ఉంటూ నాణ్యమైన విద్యను పిల్లలకి అందించడంలో నిజమైన నాయకులుగా ఎదగాలని సూచించారు. కొత్తగూడెంలోని జిల్లా విద్యా శిక్షణా కేంద్రంలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న ప్రధానోపాధ్యాయుల వృత్యంతర శిక్షణా కార్యక్రమాన్ని సందర్శించిన ఆయన మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయులు మనసుపెట్టి పనిచేస్తే సాధించలేని కార్యం ఏది ఉండదని, పాఠశాలలో సమాజ భాగస్వామ్యం పెంచుతూ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడంలో తమ పాత్ర పోషించాలని కోరారు. అంతకుముందు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాత పాల్వంచలో జరుగుతున్న జీవశాస్త్ర ఉపాధ్యాయుల శిక్షణ శిబిరాన్ని సందర్శించి మనుషుల నివాసానికి అనుకూలమైన ఈ భూగ్రహాన్ని రక్షించడంలో జీవశాస్త్ర ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని జీవశాస్త్రం చదవటం అంటే కేవలం డాక్టర్ గా స్థిరపడటం అనే ఒక అపోహ నుండి బయటపడి ఎన్నో వినూత్నమైన కోర్సులను అధ్యయనం చేస్తూ మానవాళికి అవసరమైన సహజ సిద్ధమైన ఆహార పదార్థాలను మొక్కల ద్వారా అందించడం ఒక ప్రధాన బాధ్యతగా తీసుకోవాలని కోరారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను తరగతి గదిలో వినియోగించి విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్యను అందించాలని ఉద్భోదించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఏ. నాగరాజశేఖర్, జీవశాస్త్ర శిక్షణా కేంద్ర ఇంచార్జ్ ఏ. పద్మలత, రాష్ట్ర పరిశీలకులు శ్రీహరి, రిసోర్స్ పర్సన్లు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ