తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : * ప్రకృతి వైద్యసేవలకు గుర్తింపు * అంతర్జాతీయ వాలంటీర్స్ డే వేడుకలు అంతర్జాతీయ వాలంటీర్స్ డేని పురస్కరించుకుని, కొత్తగూడెంలోని స్థానిక ఎ.వి.ఎన్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం జరిగిన వేడుకల్లో ప్రకృతి వైద్యులు, ప్రముఖ హీలర్ జి. సుగుణారావుని ఘనంగా సత్కరించి, సన్మానించారు. ఏ. టి. ఇ. సి, ఎ. ఎ. ఎ. ఒ, ఐక్య తల్లిదండ్రుల సంఘం ల సంయుక్త ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. సన్మానించిన వారిలో సంస్థల నిర్వాహకులు మారుతి రత్నాకర్, లోగాని శ్రీనివాస్, మేకల జ్యోతిరాని, వెంకటేశ్వర్లు, భిక్షపతి, బాలు, కమలారాణి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా , ప్రకృతి ఆశ్రమం ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా సుగుణారావు చేస్తున్న వైద్యసేవలను నిర్వాహకులు కొనియాడారు.
Admin
తెలుగు వెలుగు టీవీ