తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం. నీట్ పేపర్ లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర సింగ్ ప్రధాన్ రాజీనామా చేయాలి. కొత్తగూడెం అమరవీరుల స్థూపం దగ్గర కేంద్ర విద్యా శాఖ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం.ఈరోజు కొత్తగూడెం జిల్లా కేంద్రంలో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఉన్నత విద్యాసంస్థల బంద్ నిర్వహించడం జరిగింది. తదనంతరం కేంద్ర ప్రభుత్వ విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మను అమరవీరుల స్తూపం దగ్గర దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎ.ఐ.ఎస్.ఎఫ్, జిల్లా కార్యదర్శి వరక అజిత్ పిడిఎస్యు జిల్లా కార్యదర్శి దుర్గం ప్రణయ్ ఎస్.ఎఫ్.ఐ జిల్లా అధ్యక్షులు మంద నాగ కృష్ణ పి.డి.ఎస్.యు జిల్లా కార్యదర్శి జె.గణేష్, పి.డి.ఎస్.యు జిల్లా నాయకులు అరుణ్ పాల్గొని మాట్లాడారు. కేంద్ర బి.జె.పి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చలగాటం ఆడుతుంది. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశంలో మూడుసార్లు (2017,2021,2024)సార్లు నీట్ పేపర్ లీక్ జరిగింది. ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆల్ ఇండియా పరీక్ష ఎన్ని సార్లు లీక్ కావడం దేశ చరిత్రలో ఈ ఘనత మోడీ ప్రభుత్వానికి దక్కింది. పేపర్ లీక్ చేస్తున్నవారు బి.జె.పి ప్రభుత్వానికి అనుసనందంగా ఉన్నవారే అవడం గమనార్హం.22.75 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్షను రాశారని పేపర్ లీకేజ్ వల్ల వాళ్ళ భవిష్యత్ త్తు అంధకారంలో పడిందని, పేపర్ లీక్ వల్ల 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నీట్ పేపర్ లీకేజ్ కు నిరసనగా కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పార్లమెంట్ ముట్టడికి శాంతి యుతంగా నిరసనకు వెళ్లిన విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం హుకుం జారీ చేసి పోలీసుల చేత విద్యార్థులపై విచక్షణారహితంగా దాడి చేయించిందని ఈ సందర్భంగా వారు మండిపడ్డారు. దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం విద్యార్థుల పట్ల అమ్మనవేయంగా ప్రవర్తించిందని, దేశ భవిష్యత్తు మార్గదర్శకం కావలసిన విద్యార్థులు ఢిల్లీ పురవీధుల్లో నిరసనలు తెలియజేస్తున్నారని దీనికి పూర్తి బాధ్యత నరేంద్ర మోడీ ప్రభుత్వం వహించాలనీ వారు అన్నారు. నీట్ లీక్ వల్ల ప్రాణాలు పోగొట్టుకున్న విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, పరీక్ష రాసిన ప్రతి విద్యార్థి కింద న్యాయం చేయాలని వారి సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనియెడల ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో పి.డి.ఎస్.యు జిల్లా నాయకులు విజయ్,జీవన్, ప్రేమ్, వినయ్,ప్రవీణ్, ఎ.ఐ.ఎస్.ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శులు మాణిక్యాల వినయ్, గుండాల సుజన్,ఎస్.ఎఫ్.ఐ నాయకులు సాయి సంతోష్, వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ