Tuesday, 28 July 2026 06:12:56 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ స్మైల్-XII లో భాగంగా 58 మంది బాలకార్మికులకు విముక్తి : ఎస్పీ రోహిత్ రాజు

Date : 31 January 2026 05:19 PM Views : 224

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడంలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ స్మైల్-XII లో భాగంగా 01.01.2026 నుండి 31.01.2026 వరకు జిల్లా వ్యాప్తంగా 05 ప్రత్యేక బృందాల ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ పరిశ్రమలు,వ్యాపార సముదాయాలలో దాడులు నిర్వహించడం జరిగిందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు శనివారం ఒక ప్రకటనను విడుదల చేశారు.జిల్లా వ్యాప్తంగా మొత్తం ఐదు బృందాలను ఈ దాడులను నిర్వహించడానికి ఏర్పాటు చేయడం జరిగిందని,నెల రోజుల పాటు జరిగిన ఈ దాడులలో భాగంగా మొత్తం 58 మంది బాలకార్మికులను పట్టుకొని వారికి విముక్తి కలిగించడం జరిగిందని తెలిపారు.ఇందులో 09 మంది బాలికలు ఉండగా 49 మంది బాలురు ఉన్నారు.ఇందులో ఇతర రాష్ట్రాలకు చెందిన 04 బాలికలు, 27 మంది బాలురలను గుర్తించినట్లు తెలిపారు.బాలబాలికలను పనిలో పెట్టుకున్న యాజమానులపై కేసులు నమోదు చేశామన్నారు.జిల్లాలో మొత్తం 36 కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.ఆపరేషన్ స్మైల్ -XII బృందం పట్టుకున్న వారిని గుర్తించి వారి తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించడం జరిగిందని తెలియజేసారు.అనంతరం పిల్లల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని వెల్లడించారు.జిల్లాలో ఎక్కడైనా బాలకార్మికులు కనబడితే వెంటనే డయల్ 100 నకు గానీ 1098కి గానీ ఫోన్ చేసి పోలీస్ వారికి సమాచారం ఇవ్వగలరని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.ఆపరేషన్ స్మైల్ -XII నకు డీసిఆర్బీ డిఎస్పీ మల్లయ్య స్వామి నోడల్ అధికారిగా వ్యవహరించారు.ఆపరేషన్ స్మైల్ బృందంలో పనిచేసి బాలకార్మికులకు విముక్తి కలిగేలా బాధ్యతలు నిర్వర్తించిన షీటీం ఇన్స్పెక్షర్ రాము,ఆరెఎస్సై రమాదేవి,ఎస్సైలు విజయ,సతీష్,శ్రావణ్,రాఘవయ్య,సమ్మిరెడ్డి,లక్ష్మణ్,ఏఎస్సై నాగయ్య,పీసీలు మల్లికాంబ,రాంబాబులను ఈ సందర్బంగా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :