తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : 8.907 నెట్ రన్ రేట్ తో మరో రికార్డు సృష్టించిన బీకేసీఏ జట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలోని తిరుమలగుంట కె వి ఎస్ గ్రౌండ్ లో గురువారం ప్రారంభమైన T–20 అండర్–17 ఇంటర్ స్టేట్–2025 టోర్నమెంట్లో రెండో మ్యాచ్ లోను మన కుర్రోళ్ళు అదే జోరుని చూపించారు. 2వ మ్యాచ్ శ్రీరామ్–17 (తిరుపతి) జట్టుకి నిర్ణీత 20 ఓవర్లలో 22 పరుగులని ఇచ్చి 8.5 ఓవర్లలో ఆల్ అవుట్ చేసింది భద్రాద్రి కొత్తగూడెం క్రికెట్ అకాడమీ (BKCA–17) జట్టు. సెకండ్ ఇన్నింగ్స్ లో 2.1 ఓవర్లలో వికెట్లు నష్టపోకుండా 26 పరుగులు సాధించి BKCA–17 జట్టు పాయింట్స్ టేబుల్ లో 8.907 నెట్ రన్ రేట్ తో మరోసారి రికార్డుని సృష్టించింది.
Admin
తెలుగు వెలుగు టీవీ