తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెంలో నూతనంగా ఏర్పాటు చేసిన లిటిల్ స్టార్స్ పిల్లల ఆసుపత్రిని శనివారం నగర మేయర్ మూడ్ గణేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్.కే. సాబీర్ పాషా పాల్గొన్నారు. ప్రముఖ పిల్లల ఆరోగ్య వైద్య నిపుణులు (పీడియాట్రిషన్) కొడాలి సాయి సందేశ్ ఆధ్వర్యంలో ఈ లిటిల్ స్టార్స్ ఆసుపత్రిని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా నగర మేయర్ గణేష్ మాట్లాడుతూ.. విద్యా, వ్యాపార, పారిశ్రామిక రంగాలతో పాటు జిల్లా కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న కొత్తగూడెం నగరంలో వైద్య సదుపాయాలు ఎంతో అవసరమని అన్నారు. ఇందులో భాగంగానే ముఖ్యంగా పిల్లలకు వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంటే ఇక్కడే ప్రతి ఆరోగ్య సమస్యకు పరిష్కారం మార్గం దొరుకుతుందని. అదేవిధంగా లిటిల్ స్టార్స్ ఆసుపత్రిలో పిల్లలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన ఆకాంక్షించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ