Sunday, 26 July 2026 11:33:57 PM
# ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం. # ఎల్‌నినో పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు సమన్వయంతో పనిచేయాలి – రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు. # కార్పొరేషన్ అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలి.ఉప ముఖ్యమంత్రి భట్టికి వినతిపత్రం అందించిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # సింగరేణి సంస్థలో అత్యాధునిక జియో సైన్స్ లేబరేటరీని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు . # మహిళా సాధికారత కోసం అహర్నిశలు కృషి చేయాలి. జిల్లా సంక్షేమ అధికారిని స్వర్ణలత లెనీనా. # బోరు బావుల కింద వరి సాగుకు దూరంగా ఉండాలి – జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు . # యువతను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఎన్‌సీసీ పాత్ర కీలకం : జిల్లా కలెక్టర్ అంకిత్. # అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి - మేయర్ మూడ్ గణేష్. # స్త్రీ నిధి రుణాల రికవరీకి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ . # ప్రతి విద్యాసంస్థలోని యువతను మై భారత్ పోర్టల్‌లో నమోదు చేయాలి... అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డి. వేణు గోపాల్. # ఏకలవ్య పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ అమరవీర స్తూపం వద్ద కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న ఆధ్వర్యంలో నిరసన. # సర్ ప్రోగ్రాం లో భాగంగా జూలూరుపాడు మండలంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే # ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి . # జూలూరుపాడు బంగారం షాపులో ఘరానా మోసం . # రెండు వర్గాల మధ్య ఘర్షణ ఘటన – ఇరువర్గాలపై కేసులు నమోదు, బైండ్ ఓవర్ చర్యలు.

బక్కచింతలపాడు గ్రామంలో చర్ల పోలీసుల ఆధ్వర్యంలో నిర్మించిన నూతన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రారంభించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

Date : 22 July 2026 05:17 PM Views : 39

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం బక్కచింతలపాడు గ్రామంలో చర్ల పోలీసుల ఆధ్వర్యంలో నిర్మించిన నూతన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనాన్ని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ప్రారంభించారు. పాఠశాలలోని విద్యార్థిని,విద్యార్థులకు స్కూల్ బ్యాగులను, పలకలను పంపిణీ చేయడం జరిగింది. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులతో సమావేశమై పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ విద్య అనేది ప్రతి చిన్నారి భవిష్యత్తుకు బలమైన పునాది అని పేర్కొన్నారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లోని చిన్నారులు కూడా నాణ్యమైన విద్యను అభ్యసించి ఉన్నత లక్ష్యాలను సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. పాఠశాలలో పరిశుభ్రమైన వాతావరణం, క్రమశిక్షణ, విద్యార్థుల నైతిక విలువలు, హాజరు శాతం పెంపు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రతి విద్యార్థి ప్రతిభను గుర్తించి వారికి తగిన ప్రోత్సాహం అందించాలని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, యోగా, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని, వీటి ద్వారా ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, జట్టు భావన పెంపొందుతాయని చెప్పారు. అనారోగ్యం, ప్రమాదాలు లేదా ఇతర సమస్యలు ఎదురైనప్పుడు మూఢనమ్మకాలను నమ్మకుండా వెంటనే ప్రభుత్వ ఆసుపత్రులను సంప్రదించాలని తెలిపారు. ఆరోగ్య సమస్యలకు వైద్య చికిత్సే సరైన మార్గమని వివరించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్తులకు సూచనలు చేశారు. డెంగీ, మలేరియా వంటి వర్షాకాల వ్యాధుల లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలను సంప్రదించాలని తెలిపారు. గ్రామాల్లో నిర్వహించే వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని, పిల్లలకు అవసరమైన టీకాలు పూర్తిగా వేయించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలని సూచనలు చేశారు. అనంతరం వన మహోత్సవంలో భాగంగా పాఠశాల ఆవరణలో అధికారులతో కలిసి మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం డిఎస్పి అరుణ్ కుమార్, ఎస్బి 2 ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, చర్ల సీఐ రాజు వర్మ, ఎస్సైలు నర్సిరెడ్డి, కేశవ, యంఈఓ రమణ, కాంట్రాక్టర్ సంతోష్, సర్పంచ్ లక్ష్మి, ఉపాధ్యాయురాలు సౌజన్య, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :