Tuesday, 28 July 2026 11:13:45 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

అటవీ సంబంధిత సమస్యల పరిష్కారానికి మరియు గిరిజన పోడు భూమి రైతుల రుణాలు మంజూరు తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించిన : జిల్లా కలెక్టర్ జితేష్

Date : 06 August 2024 08:47 PM Views : 294

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మంగళవారం ఐడిఓసి కార్యాలయం సమావేశం మందిరంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అటవీ శాఖ అధికారి కృష్ణ గౌడ్, ఐటీడీఏ పీవో రాహుల్ తో కలిసి అటవీ సంబంధిత మరియు పోడు రైతులకు రుణాలు మంజూరు తదితర అంశాలపై జిల్లాలోని అన్ని బ్యాంకు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పోడు వ్యవసాయం నిర్వహిస్తున్న గిరిజన రైతులందరికీ వ్యవసాయ రుణాలు మంజూరు చేయాలని బ్యాంకు అందరు అధికారులను ఆదేశించారు. రైతులందరికీ సురక్ష బీమా, జీవన జ్యోతి బీమా 456 సంవత్సరానికి గాను బీమా చేయించాలని బ్యాంకు అధికారులకు సూచించారు. బ్యాంక్ అధికారులు రుణాలు మంజూరు పై ఇన్సూరెన్స్ చెయ్యాలి అని రైతులపై ఒత్తిడి చేయరాదని ఆదేశించారు. జిల్లాలోని అన్ని బ్యాంకులు అధికారులకు జూన్ మీటింగ్ నిర్వహించి రుణ మంజూరు పై దిశ నిర్దేశం చేయవలసిందిగా ఐటిడిఎపిఓ రాహుల్ కు సూచించారు. జిల్లాలో 23 మంది మహిళలు పుట్టగొడుగుల పెంపకంపై శిక్షణ తీసుకొని వచ్చారు.

వారికి సరైన రుణం మంజూరు చేయటం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని సూచించారు. జిల్లాలోని ప్రభుత్వ భవనాల్లో ఉన్న అంగన్వాడీ కేంద్రాలు మరియు దాతలు ఇచ్చిన అధ్య చెల్లించనటువంటి భవనాలకు ప్రభుత్వ ఆదేశాల అనుసారం ఉచిత కరెంటు సరఫరా చేయడం జరుగుతుందని ప్రతిపాదనను ఆగస్టు 15 లోపు సమర్పించవలసిందిగా విద్యుత్ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పోడు వ్యవసాయం చేసే రైతులకు బోర్ వేసుకునేందుకు అటవీ శాఖ నుంచి అనుమతులు త్వరితగతిన మంజూర ఎలా చూడాలని అటవీ శాఖ అధికారి కృష్ణ గౌడ్ ను కోరారు. వేసిన బోర్లకు ఉచిత విద్యుత్ ను అందించాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. ఆగస్టు 15వ తేదీ లోపు జిల్లాలోని ఒక గ్రామంలో పోడు వ్యవసాయం చేసే రైతులు అందరికీ ఉచిత విద్యుత్ అందేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీఎల్ ఎస్సీ బికం సింగ్, లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ రెడ్డి,వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, మరియు అన్ని బ్యాంకుల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :