తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వివిధపాతకాల్లో మంజూరైన నిధులతో నిర్మించిన గ్రామీణ ప్రధాన రహదారులు, అంతర్గత రహదారులు ప్రజలకు అందుబాటులోకి రాగా, మరికొన్ని రహదారులు నిర్మాణ దశల్లో వున్నాయి. ఇటీవల రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి పథకంలో నియోజకవర్గానికి మరో రూ.10.62కోట్లు మంజూరయ్యాయి. కొత్తగూడెం నియోజకవర్గంలోని పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, సుజాతనగర్ మండలాల పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో ఈ నిధులతో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం జరగనుంది. ఈ సందర్బంగా కూనంనేని మాట్లాడుతూ గ్రామీణ రాధారుల నిర్మాణంపై ప్రేత్యేక ద్రుష్టి సారించడం జరిగిందని, అంతర్గత రహదారులు, డ్రైనేజీలు, విద్యుత్ సౌకర్యం, త్రాగునీటి వసతి వంటి సమస్యలపై ప్రేత్యేక ద్రుష్టి సారించి దశలవారీగా పరిస్కరిస్తున్నామన్నారు. గడిచిన ఇరవై నెలల కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో యనబైశాతంమేర రోడ్ల నిర్మాణం పూర్తి చేశామని, తాజాగా విడుదలైన రూ.10.62కోట్లతో మిగిలిన పనులు ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేష్టమన్నారు. త్వరలో శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కూనంనేని తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ