Tuesday, 28 July 2026 03:20:52 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

కమ్యూనిటీ హెల్త్ సెంటర్ చర్ల సేవలు అమోఘం

Date : 21 November 2025 06:27 PM Views : 399

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : జిల్లా కలెక్టర్ , MLA డా తెల్లంవెంకట్రావు,DCHS డా రవి బాబు ప్రత్యేక కృషి 3 సంవత్సరాక క్రితం పాడుబడ్డ భవనం లాగా ఉన్న చర్ల ఆసుపత్రి నేడు అన్ని వసతులతో నీరుపేద వారికి సంజీవనిలా మారింది. జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ సహకారం, DCHS డాక్టర్ రవి బాబు ప్రత్యేక శ్రద్ధ, భద్రాచలం శాసన సభ్యులు డా తెల్లం వెంకటరావు సూచనలు వెరసి చర్ల ఆసుపత్రి పరిసర ప్రజలతో పాటు పక్కనున్న ఛతీస్ఘడ్ ప్రజల మన్ననలు సైతం పొందుతోంది. కేవలం ఒక సంవత్సర కాలంలో అంచలంచలుగా ఎదుగుతూ కేవలం ఎంబీబీఎస్,డెంటల్ డాక్టర్స్ తో నడిచిన ఆసుపత్రి నేడు నలుగురు స్పెషలిస్ట్ డాక్టర్స్ తో సేవలు అందిస్తోంది. మారుమూల ప్రాంత మైనా నేపథ్యం లో ప్రత్యేక శ్రద్ధ వహించినా జిల్లా కలెక్టర్ జితేశ్ పాటిల్ ఆసుపత్రి కి కావాల్సిన స్పెషలిస్ట్ వైద్యులు, మౌలిక సదుపాయాలు, డయాలిసిస్ సేవలు, పోస్ట్ మార్టమ్ సేవలు, సానిటేషన్ సేవలు, ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు, జనరేటర్ ఏర్పాటు కి జిల్లా మంత్రులు,స్థానిక శాసనసభ్యుల సమన్వయం తో ఏర్పాటు చేశారు. ఈ సదుపాయాలతో స్థానికులకు మెరుగైన సేవలు అందుబాటులోకి వచ్చాయి. నాడు డయాలిసిస్ కోసం, ప్రసూతి సేవలు,కుటుంబ నియంత్రణ సేవలు, పోస్ట్ మార్టెం సేవల కోసం భద్రాచలం వరకు అరవై కిలోమీటర్లు ప్రయాణించినా రోగులు నేడు స్థానికంగానే సేవలు పొందుతున్నారు. ప్రస్తుతం పదహారు మంది డయాలిసిస్ రోగులు చికిత్స పొందుతున్నారు. నేడు ఒక రోజే 3 పెద్దపరేషన్ లు జరిగాయి అంటేనే ఆసుపత్రి పట్ల ప్రజల నమ్మకం తెలుస్తుంది. ప్రసూతి వైద్యురాలు శ్రావణి,పిల్లల వైద్యుడు రవి కుమార్, మత్తు డాక్టర్ శివ రామ కృష్ణ ప్రసాద్, డాక్టర్ రామ్ ప్రసాద్ సమన్వయంతో ఆపరేషన్ కాగా రోగులు ఆపరేషన్ అనంతరం క్షేమంగా ఉన్నారు. పిల్లల వైద్య నిపుణులు కూడా అందుబాటులో ఉండడం , నిన్న రాత్రి వనవాసి హాస్టల్ విద్యార్థులకు తీవ్ర గొంతునొప్పి,జ్వరం తో వచ్చిన పిల్లలను రాత్రి పూట కూడా చికిత్స చేయడం తో ఆసుపత్రి సేవలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 10 కోట్ల తో నూతన ఆసుపత్రి భవన నిర్మాణం పనులు ప్రారంభమైన నేపథ్యం లో త్వరలోనే నూతన భవనం తో మరింత సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నది.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :