తెలుగు వెలుగు టీవీ - వార్తలు / చండ్రుగొండ : ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల సందర్భంగా ఆరోగ్యవంతమైన తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా ఈ రోజు అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రం మరియు దమ్మపేట మండలకేంద్రాలలో ఫిట్ అండ్ యాక్టివ్ తెలంగాణ 2K రన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు స్థానిక యువత విద్యార్థులు పోలీస్ శాఖతో పాటుగా వివిధ శాఖల అధికారులు క్రీడాభిమానులు పాల్గొని ఉత్సాహంగా పరుగెత్తారు ఈ క్రమంలో ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ప్రతి ఒక్కరూ రోజూ వ్యాయామం నడక క్రీడలను జీవితంలో భాగంగా చేసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు కార్యక్రమం అనంతరం పాల్గొన్న వారిని అభినందించి యువత చెడు వ్యాసనాల వైపు వెళ్లకుండా క్రీడల పై ఆసక్తి చూపాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్,ఆత్మకమిటీ చైర్మన్ సుంకపల్లి వీరభద్రరావు, మున్సిపల్ కమిషనర్,రెండు మండలాల అధ్యక్షులు చిన్నశెట్టి సత్యనారాయణ కక్కిరాల రమేష్ మాజీ మండల అధ్యక్షులు తుమ్మా రాంబాబు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు జూపల్లి కోదండ వెంకట రామారావు దమ్మపేట మండల అధ్యక్షులు కాకా రమేష్ రేమల్ల కేదార్నాథ్ ఎంపీడీవో రవీందర్ రెడ్డి అశ్వరావుపేట ఎంపీవో రామ కోటి రెడ్డి ఎస్ఐలు వై. రాజు సాయి కిషోర్ రెడ్డి,దమ్మపేట ఎంఈఓ దమ్మపేట సర్పంచ్ పగడాల రమాదేవి, ప్రజాప్రతినిధులు మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారూ.
Admin
తెలుగు వెలుగు టీవీ