Tuesday, 28 July 2026 08:18:45 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

కొత్తగూడెం క్లబ్ లో మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం

Date : 25 November 2025 05:13 PM Views : 293

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వడ్డీ లేని రుణాలతో మహిళల పొదుపు శక్తి, వ్యాపార దక్షత పెరుగుతోంది : కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు మహిళా శక్తితో జిల్లా అభివృద్ధి వేగవంతం అవుతుంది — జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం మంగళవారం కొత్తగూడెం క్లబ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మరియు కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా రూ.304 కోట్ల విలువైన వడ్డీ లేని రుణాలు విడుదల కావడం మహిళల ఆర్థిక స్వావలంబనకు తోడ్పడుతుందని చెప్పారు. రుణాలను క్రమశిక్షణతో తిరిగి చెల్లించడం వ్యాపార దక్షతను పెంపొందిస్తుందని, పెట్రోల్ బంకులు, బస్సులు, సోలార్ ప్లాంట్లు వంటి రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఇందిరమ్మ చీరల పంపిణీ సందర్భంగా మహిళలో కనిపించిన సంతోషం ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణం, గృహ జ్యోతి, రేషన్ కార్డుల మంజూరు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు వంటి సంక్షేమ పథకాలు ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయని అన్నారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, మాట్లాడుతూ..జిల్లాకు మొత్తం రూ.10 కోట్లు 74 లక్షల విలువైన వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం మంజూరు చేసింది అని తెలిపారు. అశ్వరావుపేటకు రూ.2.70 కోట్లు, భద్రాచలం‌కు రూ.1.51 కోట్లు, కొత్తగూడెం‌కు రూ.1.97 కోట్లు, పినపాక రూ.2.66 కోట్లు, ఇల్లందుకు రూ.1.38 కోట్లు కేటాయించగా, మొత్తం 11,423 మహిళా సంఘాలకు లబ్ది చేకూరిందని వివరించారు. రుణాలను సమర్థవంతంగా వినియోగించుకొని కొత్త పరిశ్రమలను స్థాపించి మహిళా కుటుంబాలు ఆర్థికాభివృద్ధి సాధించాలని సూచించారు. జిల్లా వైపు రాష్ట్ర, జాతీయ స్థాయి పరిశ్రమలు ఆసక్తి గా చూస్తున్న నేపథ్యంలో మహిళా సంఘాలు కొత్త సాంకేతిక పద్ధతులను, ప్రయోగాత్మక యూనిట్లు, మరిన్ని ఏర్పాటు చేస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఇటీవల జిల్లాకు లభించిన ‘జల్ సంచయ్–జన్ భాగీదారీ’ జాతీయ అవార్డు మహిళా సంఘాల సమిష్టి కృషి ఫలితమే అని కలెక్టర్ అన్నారు. మహిళ సమాఖ్య సభ్యులు పలుగు పార పట్టి ఇంకుడు గుంతలు త్రవ్వడం ద్వారానే ఇది సాధ్యమైంది అన్నారు. అదేవిధంగా, అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా జిల్లాలోని అన్ని పాఠశాలల మరమ్మతులు పూర్తి చేసామని, పాఠశాలలలో శానిటేషన్ కోసం కూడా నిధులు విడుదల చేయడం జరుగుతుందని అమ్మ ఆదర్శ కమిటీ పర్యవేక్షణలో పాఠశాలలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. ఇంటి ఆవరణలో చిన్న యూనిట్లు ఏర్పాటు చేయడం ద్వారా మహిళలు మంచి ఆదాయం ఆర్జించవచ్చని, బ్యాంకుల నుండి అవసరమైన సహకారం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో 50 శాతం అటవీ ప్రాంతం ఉన్న నేపథ్యంలో అటవీ ఉత్పత్తుల ఆధారంగా మరిన్ని యూనిట్లు స్థాపించేందుకు మహిళలు ముందుకు రావాలి అని పిలుపునిచ్చారు. ఫర్నిచర్ తయారీ శిక్షణలో మహిళల అధిక పాల్గొనడం మహిళా శక్తి ప్రతిభకు సాక్ష్యమని అన్నారు. అనంతరం లబ్ధిదారులకు కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు మరియు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమం లో సహకార సంఘ అధ్యక్షులు మండే హనుమంతరావు, మాజీ డిసిసిబి చైర్మన్ కొత్వాల శ్రీనివాస్, గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు, కొత్తగూడెం తాసిల్దార్ పుల్లయ్య,అదనపు డి ఆర్ డి ఏ నీలేష్ డ్వాక్రా సంఘాలు సభ్యులు తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :