తెలుగు వెలుగు టీవీ - వార్తలు / అశ్వారావుపేట : అశ్వారావుపేట మండల పంగిడిగూడెం వద్ద ఉదయం రోడ్డుప్రమాదం జరిగింది. ఓ యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. స్థానికులు తెలిపిన ప్రకారం.. కొత్తపల్లి వెంకటేశ్వరరావు అనే యువకుడు మండల పరిధిలోని కామయ్య పాలెం నుంచి అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీకి పామాయిల్ గెలలు లోడును తీసుకెళుతున్నాడు. ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. వెంకటేశ్వరరావు అక్కడికక్కడే చనిపోయాడు.
Admin
తెలుగు వెలుగు టీవీ