Tuesday, 28 July 2026 10:55:12 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

వాహన తనిఖీలలో ముగ్గురు వ్యక్తుల వద్ద డ్రై గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు .

Date : 18 July 2026 08:43 PM Views : 580

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : జూలూరుపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో సాయంత్రం 5:15 గంటలకు జూలూరుపాడు గ్రామంలోని శ్రీ గోపీకృష్ణ నర్సరీ ఎదుట, కొత్తగూడెం–ఖమ్మం బి.టి. రోడ్డుపై పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీలలో డ్రై గంజాయి స్వాధీనం చేసుకుని ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.పోలీసులు తనిఖీ చేస్తున్న సమయంలో OD 10 H 4342 నంబరు గల మహీంద్రా జైలో (Mahindra XYLO) వాహనాన్ని పరిశీలించగా, అందులో ప్రయాణిస్తున్న వికాస్ మండల్ (46), త్రినాథ్ బిసోయి మరియు గణేష్ ముదులి (21) అనే ముగ్గురు వ్యక్తుల వద్ద 100 గ్రాముల చొప్పున మూడు (03) ప్యాకెట్ల డ్రై గంజాయి లభ్యమైంది. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.5,000/గా అంచనా వేయబడింది. నిందితుల వద్ద నుండి డ్రై గంజాయిని పంచసాక్షుల సమక్షంలో చట్టబద్ధంగా స్వాధీనం చేసుకుని సీజ్ పంచనామా నిర్వహించారు. అనంతరం నిందితులపై ఎన్‌డీపీఎస్ చట్టం (NDPS Act) సంబంధిత నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై జీనత్ కుమార్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నిల్వ మరియు వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించి నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామని, ప్రజలు మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఏదైనా తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేసి పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :