తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా లో శుక్రవారం ఘనంగా జర్నలిస్ట్ డే వేడుకలు నిర్వహించారు. జిల్లా కేంద్రమైన కొత్తగూడెం లో సీనియర్ జర్నలిస్టులు కేక్ కట్ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ... ప్రభుత్వానికి ప్రజలకు వారధిలా జర్నలిస్ట్ లు పని చేస్తున్నారని అన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం నిధుల్ని కేటాయించాలని అన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. విధినిర్వహణలో కుటుంబాన్ని సైతం వదిలి వార్తల సేకరణలో నిమగ్నమైన జర్నలిస్టును ప్రభుత్వం అన్ని విధాలుగా చేయుతనివ్వాలని కోరారు.
Admin
తెలుగు వెలుగు టీవీ