తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సీతమ్మ తల్లి లక్ష్మీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శుక్రవారం నాల్గో రోజున భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి పూజలు నిర్వహించారు. పంటలు బాగా పండి, తమకు లక్ష్మీ కటాక్షం కలగాలని భక్తులు అమ్మవారిని వేడుకున్నారు. కార్య క్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ