Tuesday, 28 July 2026 05:07:48 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

కాకర్ల గ్రామం నందు ప్లాస్టిక్ నివారణ, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై గ్రామ సభ నిర్వహణ

Date : 06 June 2026 05:40 PM Views : 91

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు మండలంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ప్రభుత్వ కార్యక్రమము అనుసరించి 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మండలంలో గ్రామసభల నిర్వహణ – ప్రజలకు శాఖల ప్రగతి నివేదికల వివరణ, ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన జూలూరుపాడు మండలంలోని గ్రామ పంచాయతీలలో ఈరోజు గ్రామసభలు ఘనంగా నిర్వహించబడ్డాయి. గ్రామసభలకు జిల్లా స్థాయి మరియు మండల స్థాయి అధికారులు హాజరై ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కాకర్ల గ్రామపంచాయతీ గ్రామ సభకు డిప్యూటీ కమిషనర్, పంచాయతీరాజ్ & రూరల్ ఎంప్లాయ్‌మెంట్ శాఖ శ్రీమతి విద్యాలత , జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి శ్రీమతి నాగలక్ష్మి , ఉప ముఖ్య కార్యనిర్వహణ అధికారి జిల్లా పరిషత్ శ్రీ అప్పారావు , డివిజనల్ పంచాయతీ అధికారి శ్రీ ప్రభాకర్ , మండల పరిషత్ అభివృద్ధి అధికారి తాళ్లూరి రవి, ఎంపీ ఓ తులసీరామ్ గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామసభలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు తమ తమ శాఖలకు సంబంధించిన ప్రగతి నివేదికలను చదివి ప్రజలకు వివరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామస్థుల బాధ్యతలు, ప్రజా భాగస్వామ్యంపై అవగాహన కల్పించారు. ప్రత్యేకంగా ప్లాస్టిక్ నిషేధం, స్వచ్ఛత మరియు పర్యావరణ పరిరక్షణ అంశాలపై జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి శ్రీమతి నాగలక్ష్మి ప్రత్యేక వీడియో ప్రదర్శించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే విధంగా వివరించారు. అనంతరం గ్రామ ప్రజలందరితో స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణ మరియు ప్లాస్టిక్ రహిత గ్రామాల నిర్మాణానికి సంబంధించిన ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ శ్రీమతి విద్యాలత మాట్లాడుతూ, పంచాయతీరాజ్ వ్యవస్థలో వివిధ శాఖల సమన్వయం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. మండల పరిషత్ కార్యాలయం అన్ని శాఖల కార్యక్రమాల సమన్వయ బాధ్యతను నిర్వహిస్తున్నందున, మండల స్థాయి అధికారులు పరస్పర సహకారంతో పనిచేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు సమర్థవంతంగా అందించాలని సూచించారు. గ్రామసభల ద్వారా ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన పెంపొందించడంతో పాటు, గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :