Tuesday, 28 July 2026 10:18:15 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి

Date : 24 November 2025 06:04 PM Views : 161

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్మికుల "హక్కులను కాలరాసేందుకు, భారత పారిశ్రామిక రంగాన్ని దేశ, విదేశీ పెట్టుబడిదారులకు అప్పనంగా అప్పగించేందుకు దోపిడీ శక్తులకు ఎదురు లేకుండా చేయడానికే కేంద్ర ప్రభుత్వం నూతనంగా 4 లేబర్ కోడ్ లను తీసుకువచ్చిందని కార్మికసంఘాల నాయకులు మండిపడ్డారు. సోమవారం పట్టణంలోని శేషగిరిభవన్ లో కార్మిక నాయకులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్రప్రభుత్వం 29 కార్మిక చట్టాలను తొలగించి, 4 చట్ట స్వభావం లేని కోడ్లుగా మార్చడాన్ని సింగరేణి కార్మిక సంఘాలన్నీ ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాయన్నారు. కొత్త కోడ్స్ ను రద్దు చేసి పాత 29 చట్టాలనే కొనసాగించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. గతంలో కేంద్రం తీసుకువస్తున్న నాలుగు లేబర్ కోడ్ లు రద్దు చేయాలని కార్మిక సంఘాలన్నీ ధర్నాలు, ఆందోళనలు, సమ్మెలు చేసినా కేంద్రం పెడచెవిన పెట్టిందని, కార్పొరేట్ కంపెనీలు, పెట్టుబడిదారుల కోసమే కేంద్రం పనిచేస్తుందని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కోడ్ లను అనుమతించమని వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష యూనియన్ ల ఆధ్వర్యంలో ఈ నెల 25న అన్ని గనుల డిపార్టుమెంట్లలో నల్ల బ్యాడ్జీలతో నిరసనలు, ఈ నెల 26 ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టర్లకు మెమోరండాలు ఇవ్వడం, అదే రోజు సాయంత్రం 3.30కు సింగరేణి వ్యాప్తంగా అన్ని జీఎం కార్యాలయాల ముందు ధర్నా చేసే కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు వివరించారు. ఈ నిరసన కార్యక్రమాలకు అన్ని సంఘాల కార్యకర్తలు, నాయకులు, కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో ఎఐటీయుసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ, టీబీజీకేఎస్ ముఖ్యనాయకులు టిబిజికెఎస్ చీఫ్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ, ఏఐటీయూసీ నాయకులు సారయ్య సీఐటీయూ నాయకులు మంద నర్సింహా రావు,intuc నాయకులు ఆల్బర్ట్, ఏఐటియుసి, ఐ ఎన్ టి యు సి, సిఐటియు, టీబీజీకేఎస్ ముఖ్య నాయకులు పీతాంబరం, క్రిస్టోఫర్, వంగా వెంకట్, రమణ మూర్తి, తుమ్మ శ్రీను,జాఫర్, అశోక్, సూర్య నారాయణ, రవి,ఐలయ్య, వీరస్వామీ, రాములు, మధుసూదన్, జాన్సన్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :