తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అంతర్జాతీయ కార్మిక దినోత్సం సందర్భంగా రామవరం టి బి జి కె ఏస్ కార్యాలయంలో మే డే వేడుకలు ఘనంగా నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్య ప్రదాన కార్యదర్శి కాపు కృష్ణ హాజరైనారు. జెండా ఆవిష్కరణ అనంతరం ఆయన ప్రసంగించారు...ఉత్పత్తి రంగంలో దేశ సంపదను సృష్టిస్తున్న సింగరేణి కార్మికుల కష్టం మరువలేదని ఆయన తెలియచేశారు.. మే డే స్ఫూర్తితో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కార్మిక హక్కుల పరిరక్షణ, సంస్థ ప్రగతి నే లక్ష్యంగా పని చేస్తోందని ఆయన తెలియచేశారు.. కేసీఆర్ పాలనలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గుర్తింపు కార్మిక సంఘం గా కొనసాగిన సమయంలో సింగరేణి కార్మిక సంక్షేమానికి అందించిన పథకాలను, సాధించిన హక్కులను ఆయన గుర్తు చేశారు.. కార్మిక హక్కుల పరిరక్షణ, కొత్త హక్కుల సాధన కోసం గౌరవ అధ్యక్షులు కొప్పుల ఈశ్వర్ దిశ నిర్దేశం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి నాయకత్వంలో టి బి జి కె యస్ చేస్తున్న కార్యాచరణ, ప్రణాళికలు ఆయన వివరించారు.1886 సంవత్సరంలో చికాగో నగరంలో 3 లక్షల మంది కి పైగా కార్మికులు 08 గంటల పని దినాల కోసం రోడ్డు పైకి వచ్చి స్వచ్ఛందంగా శాతియుతంగా నిరసన చేస్తుంటే విచక్షణ రహితంగా పోలీస్ లు జరిపిన కాల్పుల్లో 06 గురు కార్మికులు మరణించినారని కొంత మంది నాయకులను ఉరి తీశారని, మరి కొంత మంది అశువులు బాశారని వారందరి ప్రాణ త్యాగాలకు గుర్తుగా మే డే ను జరుపుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు...భారత దేశంలో 1923 లో చెన్నయ్ లో మే డే ఉద్యమం ప్రారంభమైనప్పటికీ బ్రిటిష్ వైస్రాయ్ కౌన్సిల్ లో కార్మిక సభ్యుడిగా ఉన్న అంబేద్కర్ కార్మిక చట్టాలు రూపకల్పన చేశారని 08 గంటల పని దినాల నినాదాలను చట్టం రూపంలోకి మార్చిన గొప్ప మహనీయుడు అంబేడ్కర్ అని ఆయన కార్మిక వర్గానికి అందించిన చట్టాలే నేడు ప్రతి కార్మికుడికి శ్రీరామ రక్ష లాగా నిలుస్తున్నాయని ఆయన తెలియచేశారు... నేడు కార్మిక వర్గం ముందు అనేక సవాళ్లు ఉన్నాయని అంబేద్కర్ రూపొందించిన చట్టాలకు తూట్లు పొడిచే పెత్తందారులు పెద్ద ఎత్తున కుట్ర పన్నుతున్నారని కార్మిక వర్గం ఐక్యత గా ఉంటేనే అంబేద్కర్ సాధించిన హక్కులను కాపాడుకోగలుగుతామని ఈ సందర్భంగా ఆయన పిలుపు,నిచ్చారు.. ఈ కార్యక్రమంలో నాయకులు వైస్ ప్రెసిడెంట్ గడప రాజయ్య సెంట్రల్ కమిటీ మెంబర్స్ కాగిత విజయకుమార్,బోరింగ్ శంకర్,మహేందర్, వెంకటేశ్వర్లు, తిరుపతి,రంజిత్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ