Tuesday, 28 July 2026 01:42:50 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

సింగరేణి కీలక ఖనిజ రంగంలో మరో ముందడుగు.

Date : 23 October 2025 06:37 PM Views : 427

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సింగరేణిలో అరుదైన ఖనిజాల ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు సంసిద్ధం, ఎన్.ఎఫ్.టి.డి.సి సంస్థ సాంకేతిక సహకారంతో ప్రయోగాత్మకంగా ప్లాంటు ఏర్పాటు, సింగరేణి ఓవర్ బర్డెన్, ఫ్లై యాష్, మట్టి, నిరుపయోగ మెటీరియల్ నుండి, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ (అరుదైన కీలక ఖనిజాల) గుర్తింపు. త్వరలోనే పైలట్ ప్లాంటు నిర్మాణం: సీఎండీ శ్రీ ఎన్. బలరామ్. సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యలో భాగంగా కీలక ఖనిజ రంగంలో కూడా ప్రవేశించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ దిశగా మరో ముందడుగు వేసింది. రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు సింగరేణి ప్రాంతంలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ గుర్తించి ఉత్పత్తి చేయడానికి ఒక ప్రయోగాత్మక ప్లాంటు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాద్ సింగరేణి భవన్ లో గురువారం కేంద్ర ప్రభుత్వ అధికారిక పరిశోధన సంస్థ ఎన్.ఎఫ్.టి.డి.సి (నాన్ ఫెర్రస్ మెటీరియల్స్ టెక్నాలజీ డెవలప్ మెంట్ సెంటర్) తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కార్యక్రమంలో సింగరేణి సంస్థ తరఫున ఛైర్మన్ మరియు ఎండీ శ్రీ ఎన్. బలరామ్, ఎన్.ఎఫ్.టి.డి.సి నుంచి శ్రీ ఎన్ఎఫ్టిడీసీ డైరెక్టర్ శ్రీ బాలసుబ్రమణియన్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ వివరాలను ఛైర్మన్ మరియు ఎండీ శ్రీ ఎన్. బలరామ్ వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యలను మరింత వేగవంతం చేస్తుందని, దీనిలో భాగంగా సింగరేణి ప్రాంతంలో లభ్యమవుతున్న రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉనికిని తెలుసుకోవడానికి, లభ్యమవుతున్న రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ను ఉత్పత్తి చేయడానికి ప్రయోగాత్మకంగా ఒక ప్లాంట్ ను కొత్తగూడెం ప్రాంతంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, దీనికి సంబంధించిన సాంకేతిక సహాయాన్ని ఎన్.ఎఫ్.టి.డి.సి సంస్థ నుంచి తీసుకుంటున్నామన్నారు. ఈ ప్రయోగాత్మక ప్లాంట్ లో సింగరేణి ఓవర్ బర్డెన్ మట్టిలో లభించే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ తో పాటు, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం నుండి వెలువడే ఫ్లై యాష్ లోను, ఇతర వేస్ట్ మెటీరియల్స్ లోను లభ్యమయ్యే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ను గుర్తిస్తామని, ప్రయోగాత్మకంగా వీటిని ఉత్పత్తి చేయడం కూడా జరుగుతుందన్నారు. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ లభ్యతా శాతం, ఉత్పత్తికి గల అవకాశాలు, వ్యాపార కోణంలో లాభదాయకత తదితర విషయాలను దృష్టిలో పెట్టుకొని తదుపరి పెద్ద ఎత్తున ప్లాంట్లను ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా ఎన్.ఎఫ్.టి.డి.సి ఉన్నతాధికారులు మాట్లాడుతూ, సింగరేణి సంస్థలో తాము ఇప్పటికే పరిశోధనలు ప్రారంభించామని, కొన్ని కీలక ఖనిజాలు ఓవర్ బర్డెన్ మట్టిలోనూ, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం నుండి వెలువడే ఫ్లై యాష్ లోను ఉన్నట్లు గుర్తించామని, కొత్తగా స్థాపించనున్న పైలట్ ప్లాంటు ద్వారా మరింత సమగ్రమైన సమాచారం లభించనుందన్నారు. సింగరేణి సంస్థతో కలిసి పనిచేయడం తమకెంతో సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు.ఈ కార్రక్రమంలో సింగరేణి డైరెక్టర్ (పి అండ్ పి) కె.వెంకటేశ్వర్లు, జీఎం(కో ఆర్డినేషన్, మార్కెటింగ్) టి. శ్రీనివాస్, జీఎం (బిజినెస్ డెవలప్మెంట్) రాందాస్, జీఎం (ఎక్స్ ప్లోరేషన్) శ్రీనివాసరావు, ఎన్.ఎఫ్.టి.డి.సి డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ లోకేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :