Tuesday, 28 July 2026 01:26:37 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

తక్షణమే రైతు భరోసా నిధులు జమ చేయాలి : ఏఐకెఎస్ జిల్లా నాయకులు సలిగంటి శ్రీనివాస్

Date : 22 June 2026 04:55 PM Views : 57

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : పోడు రైతులకు పెండింగ్ పట్టాలు ఇవ్వాలి అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలి నకిలీ విత్తన దళారులపై కఠిన చర్యలు తీసుకోవాలి : ఏఐకెఎస్ జిల్లా నాయకులు సలిగంటి శ్రీనివాస్ ప్రస్తుత వానాకాలం సీజన్ ప్రారంభమైనందున అర్హులైన ప్రతి రైతు ఖాతాలో 'రైతు భరోసా' పెట్టుబడి సాయం నిధులను ఆలస్యం చేయకుండా తక్షణమే జమ చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం (ఏఐకెఎస్) జిల్లా నాయకులు సలిగంటి శ్రీనివాస్, సిపిఐ చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండల కార్యదర్శులు వాసిరెడ్డి మురళి, దీటి లక్ష్మీపతి డిమాండ్ చేశారు. వివిధ రైతు సమస్యల పరిష్కారం కోరుతూ సోమవారం లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, కొత్తగూడెం మండల తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ఏఐకెఎస్ ఆధ్వర్యంలో ధర్నాలు జరిగాయి, అనంతరం తహసీల్దార్లకు వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా వేర్వేరుగా జరిగిన ధర్నా కార్యక్రమాల్లో వారు మాట్లాడుతూ.. జిల్లాలో సుదీర్ఘకాలంగా సాగు చేసుకుంటున్న గిరిజన, గిరిజనేతర పోడు రైతులకు పెండింగ్‌లో ఉన్న పట్టాలను తక్షణమే పంపిణీ చేయాలని, పట్టాలు పొందిన రైతులకు కొత్త పాస్ పుస్తకాలు జారీ చేసి రుణ అర్హత కల్పించాలన్నారు. ధరణి పోర్టల్‌లో నెలకొన్న సాంకేతిక లోపాల వల్ల వందలాది మంది రైతుల భూములు పార్ట్-బి లోనో, లేదా ఇతరుల పేర్ల మీదో తప్పుగా నమోదయ్యాయని, ఈ భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను ప్రత్యేక చొరవతో, త్వరితగతిన పరిష్కరించి రైతులకు హక్కులు కల్పించాలని కోరారు. గతంలో ప్రకటించిన పంట రుణమాఫీ పథకం సాంకేతిక కారణాల వల్ల మండలంలో చాలా మంది రైతులకు వర్తించలేదని, అర్హత ఉండి ఉమ్మడి ఖాతాలు, రేషన్ కార్డ్ లింకేజ్ సమస్యల వల్ల ఆగిపోయిన ప్రతి రైతుకు రుణమాఫీ వర్తింపజేయాలన్నారు. ప్రస్తుత సాగు సీజన్‌లో రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని, మార్కెట్లో నకిలీ విత్తనాలు అమ్ముతూ రైతులను ముంచుతున్న దళారులు, ప్రైవేట్ వ్యాపారులపై వ్యవసాయ, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ దాడులు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమాల్లో నాయకులు నిమ్మగడ్డ వెంకటేశ్వర్ రావు, గెడ్డాడు నగేష్, నేరెళ్ల రమేష్, నాగయ్య, శాపావత్ రవి, రామారావు, ఎర్రబెల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :