తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఆన లైన్ ద్వారా మధ్యాహ్న భోజన చెల్లింపులకు చర్యలు తీసుకుంటున్నామని విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణ అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణ , విద్యాశాఖ సంచాలకుల నరసింహారెడ్డి తో కలిసి మధ్యాహ్న భోజన పథకం బిల్లుల చెల్లింపు పై జిల్లా కలెక్టర్లు విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఐడిఓసి కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణ మాట్లాడుతూ, ట్రెజరీ ద్వారా మధ్యాహ్న భోజన బిల్లుల చెల్లింపు ప్రక్రియ ఆలస్యం అవుతుందని, నేరుగా ఆన్ లైన్ నుంచే మధ్యాహ్న భోజనం బిల్లులు చెల్లించేందుకు గల అవకాశాలను విద్యాశాఖ పరిశీలిస్తుందని అన్నారు. రాష్ట్రంలో ముందస్తుగా భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద ఆన్ లైన్ బిల్లులో చెల్లింపు ప్రారంభిస్తున్నామని ఆమె తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి జిల్లాలలో ముందుగా ఒక మండలాన్ని ఎంపిక చేసుకుని, నెలరోజుల పాటు ఆ మండలం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన బిల్లులను ఆన్ లైన్ ద్వారా త్వరితగతిన చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు . పైలెట్ ప్రాజెక్టు నుంచి వచ్చే ఫలితాల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా ఆన్లైన్ చెల్లింపులు జరపడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకం నిర్వహణలో భాగంగా వివిధ రకాల రిపోర్టులు ఉంటాయని, అవి ప్రస్తుత యాప్ లో ఒకేసారి జనరేట్ అయ్యే విధంగా లేవని, నెలవారి సంగ్రహక రిపోర్టు ఆధారంగా బిల్లులు వాటికవే జనరేట్ అయ్యే విధంగా ప్రత్యేక ప్యాకేజీ మధ్యాహ్న భోజన పథకం యాప్ ను మెరుగుపరచాలని సూచించారు. మధ్యాహ్న భోజన పథకం యాప్ ద్వారా రోజు వారి కచ్చితంగా హాజరు పాఠశాల స్థాయిలో ఆన్లైన్ లో ఇవ్వవలసి ఉన్నందున దానికి ఆయా పాఠశాలల ఏఎంలు యాప్ లో విద్యార్థులకు ఖచ్చితమైన హాజరు వివరాలను నమోదు చేయాలని దానిని నెలవారి రిపోర్ట్ ను ఎంఈఓ ఆన్లైన్ లో ధ్రువీకరించడం ద్వారా మధ్యాహ్నం భోజన పథకం బిల్లులు ఆన్లైన్లోనే జనరేట్ అయ్యేలా యాప్ ను రూపొందించాలని కలెక్టర్ సూచించారు. దానికి గాను విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా సంతృప్తి వ్యక్తం పరిచి యాప్ రూపొందించే దిశలో కృషి చేయాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర చారి, కొత్తగూడెం ఎంఈఓ డాక్టర్ ప్రభు దయాల్, ఎఫ్ఓ శ్రీనివాసరావు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ