తెలుగు వెలుగు టీవీ - వార్తలు / ఖమ్మం : ఖమ్మం మున్నేరులో చిక్కుకున్న వారు ఆర్తనాదాలు చేస్తున్నారు. బొక్కలగడ్డలో ఓ ఇంటిలో కుటుంబం చిక్కిపోయింది. ఉదయం లేచి చూసేసరికే ఇంటిని వరద నీరు చుట్టుముట్టింది. ఈక్రమంలో బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో దిక్కుతోచని స్థితిలో ఓ వీడియోలో తమ ఆవేదనను చెప్పుకున్నారు. మంత్రులు తుమ్మల, పొంగులేటి స్పందించి తమను కాపాడాలని లేదంటే ప్రాణాలు కోల్పోతామని కన్నీరు పెట్టుకున్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ