Tuesday, 28 July 2026 08:48:15 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

ఆధునిక వ్యవసాయ పద్ధతులతో అధిక దిగుబడులు సాధించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 23 March 2026 04:32 PM Views : 195

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అనుసరించి పంటల దిగుబడులను గణనీయంగా పెంచుకోవాలని జిల్లా కలెక్టర్ అంకిత్ పిలుపునిచ్చారు. సోమవారం రామవరం కృషి విజ్ఞాన కేంద్రంలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) ఆధ్వర్యంలో నిర్వహించిన కిసాన్ మేళా మరియు వ్యవసాయ ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గాలికుంట వ్యాధి నివారణకు సంబంధించి నిర్వహిస్తున్న జాతీయ ఉచిత టీకాల కార్యక్రమంపై అవగాహన కల్పించే గోడపత్రికలను కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం జెండా ఊపి టీకాల కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. కిసాన్ మేళా సందర్భంగా వ్యవసాయం, కృషి విజ్ఞాన కేంద్రం, పశుసంవర్ధక రంగాలకు సంబంధించిన వివిధ స్టాళ్లను కలెక్టర్ ప్రారంభించి సమగ్రంగా పరిశీలించారు. రైతులకు అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పద్ధతులు, నాణ్యమైన విత్తనాల వినియోగం, పంటల నిర్వహణ విధానాలు, వ్యవసాయ యంత్రాల వినియోగం, పంట రక్షణ చర్యలు, నీటి సంరక్షణ పద్ధతులపై ఏర్పాటు చేసిన ప్రదర్శనలను ఆసక్తిగా వీక్షించారు. ఈ సందర్భంగా రైతులతో ప్రత్యక్షంగా ముచ్చటించి వారి సమస్యలను తెలుసుకుని, సంబంధిత అధికారులకు తగిన సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మారుతున్న వాతావరణ పరిస్థితులు, అకాల వర్షాలు, వడగళ్ల వానలు వంటి సవాళ్లను దృష్టిలో ఉంచుకుని రైతులు శాస్త్రీయ మరియు ఆధునిక పద్ధతులను అనుసరించడం అత్యవసరమని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో జరుగుతున్న సాంకేతిక మార్పులను రైతులు స్వీకరించి, ఆధునిక విధానాల ద్వారా ఖర్చులను తగ్గిస్తూ దిగుబడులను పెంచుకోవచ్చని సూచించారు. కృషి విజ్ఞాన కేంద్రం అందిస్తున్న శిక్షణలు, శాస్త్రవేత్తల సలహాలు, ప్రభుత్వ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పంట మార్పిడి విధానాలను అమలు చేయడం ద్వారా నేల సారాన్ని కాపాడుకోవడంతో పాటు పంటల ఉత్పత్తి పెరుగుతుందని తెలిపారు. అదేవిధంగా సంప్రదాయ వ్యవసాయంతో పాటు వాణిజ్య పంటల సాగు, మిశ్రమ పంటల విధానం, పశుసంవర్ధక రంగాన్ని అనుసంధానం చేసుకోవడం ద్వారా రైతుల ఆదాయం పెంపొందించుకోవచ్చని వివరించారు. ప్రజా పాలన 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ కిసాన్ మేళా నిర్వహించబడిందని, రైతులకు ఒకే వేదికపై ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ మేళా ద్వారా రైతులు కొత్త పద్ధతులను నేర్చుకుని వాటిని తమ పొలాల్లో అమలు చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గణేష్, డిప్యూటీ మేయర్ సిరిపురం లలిత, వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, ఉద్యానవన శాఖ అధికారి కిషోర్, మత్స్య శాఖ అధికారి ఇంతియాజ్ ఖాన్, త్రీ ఇంక్లైన్ సర్పంచ్ ఈసం ప్రవల్లిక, కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ భరత్, ఆత్మ చైర్మన్లు వీరభద్ర రావు, బుచ్చిబాబు, బోడా మంగీలాల్, శాస్త్రవేత్తలు, తహసీల్దార్, ఎంపీడీవో, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :