Tuesday, 28 July 2026 02:15:39 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

సింగరేణి సంస్థలో అత్యాధునిక జియో సైన్స్ లేబరేటరీని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు .

Date : 23 July 2026 08:17 PM Views : 811

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సింగరేణి సంస్థలో భూగర్భ శాస్త్ర పరిశోధనలు, ఖనిజాల విశ్లేషణను మరింత ఆధునికీకరించే లక్ష్యంతో కొత్తగూడెం కార్పొరేట్ ఏరియాలో ఏర్పాటు చేసిన అత్యాధునిక జియో సైన్స్ లేబరేటరీని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు గురువారం ప్రారంభించారు.జిల్లా పర్యటనలో భాగంగా కొత్తగూడెంకు విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లుకు జిల్లా కలెక్టర్ అంకిత్ పూల మొక్క అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి జియో సైన్స్ లేబరేటరీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రారంభోత్సవం అనంతరం లేబరేటరీలో ఏర్పాటు చేసిన అత్యాధునిక యంత్ర పరికరాలు, ఖనిజాల విశ్లేషణ, బొగ్గు నాణ్యత నిర్ధారణ, భూగర్భ శాస్త్ర పరిశోధనలకు వినియోగిస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉప ముఖ్యమంత్రి పరిశీలించారు. లేబరేటరీలో అందుబాటులో ఉన్న పరీక్షా విధానాలు, విశ్లేషణ సామర్థ్యం, పరిశోధనల ప్రాముఖ్యతపై సింగరేణి అధికారులు ఉప ముఖ్యమంత్రికి వివరించారు.ఈ జియో సైన్స్ లేబరేటరీ ద్వారా ఖనిజాల నమూనాల విశ్లేషణ, బొగ్గు నాణ్యత నిర్ధారణ, భూగర్భ శాస్త్ర పరిశోధనలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరింత వేగవంతంగా, కచ్చితత్వంతో నిర్వహించేందుకు అవకాశం కలుగుతుందని అధికారులు తెలిపారు. దీంతో సింగరేణి సంస్థలో శాస్త్రీయ పరిశోధనలకు మరింత ప్రోత్సాహం లభించడంతో పాటు ఆధునిక గనుల నిర్వహణకు అవసరమైన సాంకేతిక సేవలు మరింత మెరుగుపడనున్నాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వైరా శాసనసభ్యులు రాందాస్ నాయక్, జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రోహిత్ రాజు, సింగరేణి సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ బుద్ధ ప్రకాశ్ జ్యోతి, ఐఏఎస్, సింగరేణి డైరెక్టర్ (పర్సనల్, అడ్మినిస్ట్రేషన్ అండ్ వెల్ఫేర్) గౌతమ్ పొట్రూ, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్, సింగరేణి ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :