తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఫుట్‌పాత్ ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ మున్సిపల్ కమిషనర్‌కు జేబీపీ నేత కామేష్ ఫిర్యాదు కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఫుట్‌పాత్‌లు ఆక్రమణలకు గురవుతున్నప్పటికీ సంబంధిత అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయని,ఏంజీ రోడ్డులో ప్రభుత్వ ఫుట్‌పాత్ స్థలాన్ని ఆక్రమించి అక్రమ నిర్మాణం చేపడుతున్న వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ బుధవారం మున్సిపల్ కమిషనర్ సుజాతకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు.ఆయన మాట్లాడుతూ ఏంజీ రోడ్డులోని ఇంటి నెంబర్లు 6-2-141,6-2-142కు చెందిన షాప్ యజమాని ఇటీవల చేపడుతున్న నిర్మాణాల్లో అవసరమైన అనుమతులు లేకుండానే ప్రభుత్వ ఫుట్‌పాత్ స్థలాన్ని ఆక్రమించి సెట్ బ్యాక్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు కొనసాగిస్తున్నారని ఆరోపించారు.అంతేకాకుండా భవనం పక్కన ఉన్న స్థలంలో కూడా అక్రమంగా మెట్లు నిర్మిస్తున్నారని పేర్కొన్నారు.ప్రధాన రహదారిపై ఇలాంటి నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.సాధారణ ప్రజలు చిన్నపాటి నిర్మాణాలు చేపట్టినా నోటీసులు జారీ చేసే అధికారులు,కొంతమంది విషయంలో మాత్రం ఎందుకు మౌనం పాటిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు.ఫుట్‌పాత్‌ల ఆక్రమణల వల్ల పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.వెంటనే స్థలాన్ని పరిశీలించి అక్రమ నిర్మాణాలను తొలగించడంతో పాటు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈకార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జున రావు,జిల్లా ప్రధాన కార్యదర్శి మాలోత్ వీరు నాయక్,అసెంబ్లీ అధ్యక్షుడు నాగుల రవికుమార్,పట్టణ అధ్యక్షుడు గజ్జల శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ