Wednesday, 29 July 2026 05:49:40 AM
# కాకర్ల ప్రభుత్వ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా (PD) పనిచేస్తున్న చింతలపూడి యుగంధర్ మృతి. # అటవీ–రెవెన్యూ భూ సమస్యల పరిష్కారానికి జాయింట్ సర్వేను వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ . # ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి. కార్పొరేషన్ మేనేజర్ కి వినతి పత్రాన్ని అందించిన మునిగడప. # ఏఐటీయూసీ సమ్మె నోటీసుపై ఆర్ ఎల్ సి సమక్షంలో యాజమాన్యంతో రెండో విడత చర్చలు. # విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.

16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ.

Date : 27 July 2026 06:40 PM Views : 180

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 16 వ డివిజన్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలిముద్ద- బాల భరోసా కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది.15,18,19 అంగన్వాడీ సెంటర్లలో తొలిముద్ద - బాల భరోసా కార్యక్రమాన్ని 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ చిన్నారులకు తొలిముద్దను వడ్డించి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పిల్లల్లో పౌష్టికాహార లోపం ఉండకుండా వారి ఎదుగుదలలో అనారోగ్య సమస్యలు తలెత్తకుండా మంచి పౌష్టిక ఆహారాన్ని అందించాలని ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్లలోని చిన్నపిల్లలకు గోధుమ రవ్వ లో అన్ని రకాల పప్పులు , పల్లీలు మొదలైన ప్రోటీన్ సహిత ఆహారాన్ని అందించాలని ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందని ఆమె తెలిపారు. పిల్లలకి అందించే పౌష్టికాహారంలో కాంట్రాక్టర్ నాణ్యత లోపం లేకుండా ముడి పదార్థాన్ని అందించాలని, ఆ బాధ్యతను అంగన్వాడీ టీచర్స్, అంగన్వాడీ సూపర్వైజర్లు, ఉన్నత అధికారులు చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఆమె అన్నారు. 15, 18, 19 సెంటర్ల టీచర్లు ఎన్ సరోజ, ది నీలవేణి, షహనాజ్ బేగం,ఆయమ్మ వెంకటలక్ష్మి చిన్నారులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :