తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు మండల కేంద్రంలో మాల మహానాడు పాదయాత్ర కరపత్రాల విడుదల. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం ఇలా ఎస్సీ ఎస్టి కులాలను విభజించడం వలన అణగారిన కులాలు భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని మండల పరిధిలో అంబేద్కర్ సెంటర్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద మాల మహానాడు పాదయాత్ర కరపత్రాలు విడుదల చేసిన సందర్భంగా మాల మహానాడు మండల అధ్యక్షుడు బుడిపుడి ప్రభాకర్ అన్నారు. ఐక్యంగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ కులాలను విభజించు పాలించు అన్నట్లుగా కేంద్రం చేసినటువంటి కుట్రలో దళిత గిరిజన ప్రజలకు ఎంతో నష్టం జరుగుతుందని ఆయన అన్నారు. ఏది ఏమైనాప్పటికీ వర్గీకరణ విషయాన్ని వెనక్కు తీసుకొని ఐక్యంగా అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్నటువంటి కులాలను ఒక తాటి పైన ఉంచకుంటే మాల మహానాడు సంఘం తరఫున జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని ఉధృతంగా జరుగుతుందని ఆయన అన్నారు .ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా నాయకులు ఇల్లంగి తిరుపతి, గడి దేశి కాంతయ్య ,పోతురాజు, రామారావు, బుడిబుడి ప్రతాపు, కల్లోజి రవికాంత్, లాజర్ రమేష్, సామెల్, పనితీ వెంకటేశ్వర్లు, బాబురావు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ