తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భారతీయ జనతా పార్టీ త్వరలో జరగ బోయే స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా పార్టీ కార్యకర్తలను నాయకులను గ్రామ వికాసం బిజెపితోనే సాధ్యం అన్న కార్యక్రమం తీసుకుని ప్రతి ఇంటింటికి కార్యకర్తలు వెళ్లే విధంగా రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బిజెపి భారీ సంఖ్యలో స్థానిక సంస్థలలో విజయం సాధించే వ్యూహాన్ని తీసుకొని ప్రజలలోకి వెళ్లి అధికార ప్రభుత్వం ఇచ్చిన తప్పుడు హామీలను అబద్ధపు ప్రచారాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి కేంద్ర ప్రభుత్వం ఎన్ని పథకాలను గ్రామ పంచాయితీల నందు వివరిస్తారని అన్నారు. పోస్టర్ విడుదల కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ తిమ్మిరి నరేంద్రబాబు, పార్లమెంట్ కో- కన్వీనర్ జల్లారపు శ్రీనివాస్, సీనియర్ నాయకులు యమునూరి శివ,కొత్తగూడెం టౌన్ ప్రెసిడెంట్ శీలం విద్యాసాగర్, గొడుగు శ్రీధర్ యాదవ్,కృష్ణారెడ్డి మరియు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ