తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈరోజు డిప్యూటీ జిల్లా వైద్య & ఆరోగ్య అధికారి (Dy. DMHO), జిల్లా శిశు ఆరోగ్య మరియు రోగనిరోధక టీకాల కార్యక్రమ అధికారి డా. ప్రతాప్, జిల్లా ఎన్‌సీడీ కార్యక్రమ అధికారి డా. దినేష్‌తో కలిసి మణుగూరు మరియు కరకగూడెం మండలాలకు చెందిన ఏఎన్‌ఎంలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రోగనిరోధక టీకాల కార్యక్రమం, పిల్లల పూర్తి టీకాల కవరేజ్, డ్రాప్‌అవుట్ మరియు మిస్డ్ కేసుల గుర్తింపు, యూ-విన్ పోర్టల్‌లో సకాలంలో నమోదు, హై రిస్క్ ప్రాంతాల్లో ప్రత్యేక టీకా కార్యక్రమాల నిర్వహణ, వ్యాక్సిన్ నిర్వహణ తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. అలాగే ఎన్‌సీడీ (Non-Communicable Diseases) కార్యక్రమంలో హైపర్‌టెన్షన్, మధుమేహం, క్యాన్సర్ స్క్రీనింగ్, లక్ష్యాల సాధన, స్క్రీనింగ్ నాణ్యత, ఫాలోఅప్ సేవలు మరియు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ప్రతి ఏఎన్‌ఎం తమ పరిధిలోని అర్హులైన లబ్ధిదారులకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించి, ప్రభుత్వ లక్ష్యాలను పూర్తి చేయడానికి కృషి చేయాలని అధికారులు ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా సీహెచ్‌ఓ నాగభూషణం, హరికిషన్‌తో పాటు మణుగూరు కరకగూడెం ప్రాంతాలకు చెందిన ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ