తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం టౌన్ జనవరి 21 (తెలుగు వెలుగు) జిల్లా SP B. రోహిత్ రాజు IPS గారి ఆదేశానుసారం ప్రకారం ఈ రోజు ప్రియదర్శి డిగ్రీ కాలేజీ లో గంజాయి తదితర డ్రగ్ పైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇట్టి అవగాహన కార్యక్రమానికి కొత్తగూడెం DSP అబ్దుల్ రహమాన్, ఉమ్మడి ఖమ్మం TSNAB DSP మధు మోహన్ రెడ్డి ముఖ్య అధితులు గా విచ్చేసి స్కూల్ విద్యార్థులు గంజాయి పట్ల జాగ్రత్త వహించాలని, మీ స్నేహాతులు లేదా ఎవరైనా గంజాయి కి అలవాటు పడితే సమాచారం ఇవ్వాలని, వారి వివరాలు గొప్యంగా ఉంచుతామని చెప్పారు. అలాగే గంజాయికి దూరంగా ఉంటూ మీ లక్ష్యం కొరకు ఎల్లపుడు ఆలోచిస్తూ చదువు పైన శ్రద్ద వహించాలని సూచించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ