Monday, 27 July 2026 01:07:39 AM
# ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం. # ఎల్‌నినో పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు సమన్వయంతో పనిచేయాలి – రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు. # కార్పొరేషన్ అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలి.ఉప ముఖ్యమంత్రి భట్టికి వినతిపత్రం అందించిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # సింగరేణి సంస్థలో అత్యాధునిక జియో సైన్స్ లేబరేటరీని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు . # మహిళా సాధికారత కోసం అహర్నిశలు కృషి చేయాలి. జిల్లా సంక్షేమ అధికారిని స్వర్ణలత లెనీనా. # బోరు బావుల కింద వరి సాగుకు దూరంగా ఉండాలి – జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు . # యువతను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఎన్‌సీసీ పాత్ర కీలకం : జిల్లా కలెక్టర్ అంకిత్. # అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి - మేయర్ మూడ్ గణేష్. # స్త్రీ నిధి రుణాల రికవరీకి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ . # ప్రతి విద్యాసంస్థలోని యువతను మై భారత్ పోర్టల్‌లో నమోదు చేయాలి... అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డి. వేణు గోపాల్. # ఏకలవ్య పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ అమరవీర స్తూపం వద్ద కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న ఆధ్వర్యంలో నిరసన. # సర్ ప్రోగ్రాం లో భాగంగా జూలూరుపాడు మండలంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే # ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి . # జూలూరుపాడు బంగారం షాపులో ఘరానా మోసం . # రెండు వర్గాల మధ్య ఘర్షణ ఘటన – ఇరువర్గాలపై కేసులు నమోదు, బైండ్ ఓవర్ చర్యలు.

ఇందిరమ్మ ఇండ్ల‌ ప‌థ‌కంతో సొంతింటి కల సాకారం : టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు

Date : 11 May 2026 11:48 AM Views : 122

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / సుజాతనగర్ : మండలంలోని గరీబ్ పేట పంచాయతీలో నూతనంగా నిర్మాణమైన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో ఆదివారం టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు పాల్గొని, ప్రారంభించినారు లబ్ధిదారులు కట్టబోయిన రజిత - సతీష్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపి వారితో కలిసి సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా నాగా సీతారాములు మాట్లాడుతు పేద కుటుంబాలకు సొంత ఇల్లు కల్పించడం ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు ఇందిరమ్మ ఇళ్ల ద్వారా స్థిరమైన నివాసం కల్పిస్తూ వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి తమ కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, సీఎం రేవంత్ రెడ్డి, గృహనిర్మాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ల సహకారంతో ప్రతీ అర్హత కలిగిన పేద కుటుంబానికి ఇల్లు ఇప్పించేలా కృషి చేస్తానని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం సొసైటీ చైర్మన్ మండే వీర హనుమంతరావు, గరీబ్ పేట సర్పంచ్ కూసం దివ్యతేజ,ఉప సర్పంచ్ రెడ్డిబోయిన వెంకన్న,మాజీ ఎంపీటీసీ కసనబోయిన భద్రం, మైనారిటీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ కరీంపాషా,ఓబీసీ మండల అధ్యక్షులు కసనబోయిన లక్ష్మణ్,విద్యాకమిటీ చైర్మన్ కట్టెబోయిన లింగమల్లు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బొమ్మనబోయిన సైదులు, తిరుపతి యాదవ్ యువజన కాంగ్రెస్ నాయకులు గుగులోతు కోటేష్, సాయిచంద్ మరియు నాయకులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :