తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి.యువతరానికి పదవి ఇచ్చి రేవంత్ చిత్తశుద్ది నిరూపించుకోవాలి.జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. జెన్ జీ నీ ముందుగా విద్యాశాఖ మంత్రిని చేసి,తర్వాత ఎమ్మెల్సీ గా చేయాలని జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సోమవారం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల హైదరాబాద్ లో జరిగిన కొవ్వత్తుల ర్యాలీ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 2029 లో కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత జెన్ జీ ని కేంద్ర విద్యాశాఖ మంత్రిని చేసేలా ఇక్కడ ఉన్న మంత్రి వర్గం అంత సిఫారసు చేస్తామని ప్రగల్భాలు పలకడం కాదని 2023 నుండి తను చూస్తున్న విద్యాశాఖలో గురుకుల పాఠశాలల్లో ఎంతోమంది బిడ్డల ప్రాణాలు పోతున్నాయని,రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ గురుకుల,ఆశ్రమ పాఠశాలల్లో నీటి వసతి కరువైందని అని పిల్లలు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారని,విద్యాశాఖ సరిగా లేక విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కదా ఒక "జెన్ జీ" కి ఎమ్మెల్సీ ఇచ్చి విద్యాశాఖ మంత్రిని చేసి రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సవాలు చేశారు.రాహుల్ ప్రధాని అంటూ మోచేతికి బెల్లం పెట్టే ముచ్చట్లు ఎందుకని,ఇప్పటికిప్పుడు అవకాశం ఉండగా రాహుల్ గాంధీకి ముడి పెట్టడం ఎందుకని ప్రశ్నించారు...తల్లిదండ్రులు పిల్లలను కనీ,పెంచి చదివించే స్థోమత లేక,రోజుల తరబడి పిల్లల్ని చూడకుండా ఉంటూ హాస్టల్స్ లో ఉంచి పిల్లల్ని చదివిస్తుంటే పాలకుల అసమర్ధత వల్ల పిల్లలు చనిపోయి ఇంటికి శవాలుగా వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.రేవంత్ రెడ్డి వెంటనే విద్యాశాఖను యువకులకు అప్పగించి విద్యా వ్యవస్థను కాపాడాలని కోరారు.ఈ కార్యక్రమంలో వినయ్,చెనిగరపు నిరంజన్ కుమార్,వంశీ,శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ