Tuesday, 28 July 2026 12:39:40 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

విద్య జీవితాన్ని మార్చే ఆయుధం : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 01 February 2026 05:05 PM Views : 144

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : విద్య జీవితాన్ని మార్చే ఆయుధం అని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు.ఆదివారం జిల్లాలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న 16 షెడ్యూల్డ్ కులాల వసతి గృహాలలో 10వ తరగతి చదువుతున్న 212 మంది విద్యార్థినీ విద్యార్థులకు ప్రేరణ, శిక్షణ తరగతులను కొత్తగూడెం క్లబ్‌లో ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులలో ఆత్మవిశ్వాసం పెంపొందించి, పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించి, భారత రాజ్యాంగ శిల్పి డా. బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల అలంకరణ గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, విద్య అనేది జీవితాన్ని మార్చే ప్రధాన ఆయుధమని, విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయిలో స్థిరపడాలని సూచించారు. 10వ తరగతిలో వచ్చే మార్కులు మాత్రమే జీవిత విజయానికి కొలమానం కాదని, నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించి సమాజంలో స్థిరపడినప్పుడే నిజమైన విజయాన్ని పొందినట్టు అవుతుందని తెలిపారు.విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ, సమయపాలన, పట్టుదల వంటి విలువలను అలవర్చుకోవాలని సూచించారు. ప్రభుత్వము ఎస్సీ విద్యార్థుల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకొని ముందుకు సాగాలని తెలిపారు. విద్యార్థులు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, వార్డెన్ల సూచనలను పాటిస్తూ నిరంతర కృషితో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు.ఈ ప్రేరణ, శిక్షణ తరగతుల ద్వారా విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెరిగి, మెరుగైన విద్యా ఫలితాలు సాధించేందుకు దోహదపడుతాయని కలెక్టర్ తెలిపారు.అనంతరం సబ్జెక్టు నిపుణులు విద్యార్థులకు 10వ తరగతి పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన బోధన అంశాలపై శిక్షణ అందించారు. ప్రతి సబ్జెక్టులో ముఖ్యమైన అధ్యాయాలు, ప్రశ్నల రూపకల్పన, సమయ నిర్వహణ, పరీక్షలలో మార్కులు ఎలా సాధించాలి అనే అంశాలపై వివరంగా బోధించారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తూ, పరీక్షలపై ఉన్న భయాన్ని తొలగించే విధంగా మార్గదర్శనం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి ఎ. శ్రీలత, సహాయ సంక్షేమ అధికారులు కొప్పుల హనుమంతరావు, సిహెచ్. అక్షయ్, జిల్లాలోని వసతి గృహ సంక్షేమ అధికారులు, కార్యాలయ సిబ్బంది ఆర్.వి.ఆర్. ప్రసాద్, నరసింహారావు, సాయి చరణ్, నాగలక్ష్మి మరియు బోధన సిబ్బంది తారాచంద్, మోహన్ రావు, దస్తగిరి, బి.వి.ఎల్. కుమార్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :