Tuesday, 28 July 2026 12:41:56 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

సమన్వయంతో తొలి విడత పంచాయతీ ఎన్నికలను విజయవంతం చేయాలి: కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 09 December 2025 08:29 PM Views : 200

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, జనరల్ అబ్జర్వర్ సర్వేశ్వర్ రెడ్డి, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, పోలీసు శాఖ అధికారులు, ఎన్నికల సిబ్బందితో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.కలెక్టర్ మాట్లాడుతూ గురువారం నిర్వహించనున్న తొలి విడత ఎన్నికల కోసం కేటాయించిన సిబ్బంది తమ విధులకు సంబంధిత కేంద్రాల్లో రేపు ఉదయం తప్పనిసరిగా రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. అన్ని పోలింగ్ కేంద్రాలకు అవసరమైన సామాగ్రిని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుండి సమయానుసారంగా తరలించాలని అన్నారు. పోలింగ్‌కు అవసరమైన బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులు, ఇతర సామగ్రి తగినన్ని ఉన్నాయో లేదో పరిశీలించాలని సూచించారు.పోలింగ్ రోజు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్ జరగనుండటంతో, ప్రజల్లో అవగాహన కల్పించేలా పంచాయతీ వాహనాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని, ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పటిష్ట బందోబస్తుతో పాటు వీడియో పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని, వీడియో కెమెరాలు బ్యాలెట్ బాక్సులను నిరంతరం పర్యవేక్షించేలా అమర్చాలని ఆదేశించారు. ఎన్నికల సిబ్బంది పూర్తిస్థాయిలో అవగాహనతో పనిచేయాలని, వారు కలిగే సందేహాల నివృత్తికి తగిన శిక్షణ ఇవ్వాలని అధికారులకు సూచించారు.పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులు తరలించేందుకు అవసరమైన రవాణా వాహనాలను ముందుగానే సిద్ధం చేసుకుని, నిర్దేశించిన రూట్లలోనే తరలించాలన్నారు. పోలింగ్ రోజు నివేదికలు సమర్పించేందుకు ప్రత్యేక ఆపరేటర్‌ను నియమించి, వారికి తగిన శిక్షణ ఇచ్చి సమయానికి అన్ని నివేదికలు సమర్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున పోలింగ్ అనంతరం ర్యాలీలు, సంబరాలు, విజయోత్సవాలు నిర్వహించేందుకు అనుమతి ఉండదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎన్నికల సిబ్బందికి అవసరమైన భోజనం, రవాణా వంటి సదుపాయాలు ఖచ్చితంగా కల్పించాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని తెలిపారు. ఎన్నికల సిబ్బంది, పోలీసు సిబ్బంది పరస్పర సమన్వయంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. పెద్ద పంచాయతీలు అయిన భద్రాచలం, సారపాక ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలకు తగినంత సిబ్బందిని ఏర్పాటు చేయాలని తెలిపారు. పోలింగ్ ముగిసిన అనంతరం కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :