Tuesday, 28 July 2026 12:44:26 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

మంగపేటలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

Date : 06 August 2025 05:12 PM Views : 698

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : ములకలపల్లి మండలం మంగపేట గ్రామంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ తో కలిసి బుధవారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. మంగపేట గ్రామంలోని అంగన్వాడి కేంద్రం, ప్రాథమిక పాఠశాల మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు మరియు గర్భిణీ స్త్రీలకు అందిస్తున్న పౌష్టికాహారం తదితర సేవల గురించి అంగన్వాడీ టీచర్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రంలో ఉన్నటువంటి గుడ్లను మరియు ఇతర ఆహార పదార్ధం నిల్వలను పరిశీలించారు. సందర్భంగా కలెక్టర్ అంగన్వాడీ టీచర్ ను సి హెచ్ ఆర్ క్రింద పిల్లలకు ఏ విధమైన పౌష్టికాహారం అందిస్తున్నారు? గర్భిణి స్త్రీలకు ఏ విధమైన పౌష్టికాహారం అందిస్తున్నారు అని అడిగి తెలుసుకున్నారు? గర్భిణీలలో రక్తహీనత లేకుండా చూడాలని, వైద్య సిబ్బంది ద్వారా గర్భిణీలకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు పౌష్టికాహారం అందించాలని, గర్భిణీలు, పిల్లలకు వ్యాధినిరోధక టీకాలు ఇప్పించాలన్నారు. అంగన్వాడీ కేంద్రానికి ప్రహరీ గోడ లేకపోవడం వలన కోతులు మరియు పాముల వల్ల ఇబ్బందులకు గురి అవుతున్నామని కలెక్టర్ దృష్టికి అంగన్వాడీ సిబ్బంది తీసుకురాగా, వెంటనే స్పందించిన కలెక్టర్ మట్టి ఇటుకలతో ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టే విధంగా వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.అనంతరం మంగపేట ప్రాథమిక పాఠశాలో విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించి, విద్యార్థుల పుస్తక పఠనం మరియు చేతిరాతను కలెక్టర్ పరిశీలించారు. మధ్యాహ్న భోజనానికి సిద్ధంగా ఉన్న ఆహార పదార్థాలను కలెక్టర్ మెనూ ప్రకారం ఉన్నాయా లేదా అని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాలలోని తరగతి గదిలలో జిల్లా కలెక్టర్ విద్యార్థులతో ముఖాముఖి ముచ్చటించారు. విద్యార్థుల విద్యాసామర్థ్యంపై పలు ప్రశ్నలు వేసి బోర్డు పై రాయించి విద్యార్థుల సామర్థ్యాన్ని మరియు వారి యొక్క చేతిరాతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు అనంతరం విద్యార్థులకు నోట్ పుస్తకాలు మరియు పెన్నులు బహుకరించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలలోప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల ఆరోగ్యం, చదువు అత్యంత ప్రాధాన్యమైనవని అన్నారు. అదేవిధంగా పాఠశాల వసతులు, భోజనం నాణ్యత విషయంలో ఎలాంటి వ్యత్యాసం రావొద్దని ఆదేశించారు.రోజువారి మెనూ పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు.పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించేలా అవగాహన కల్పించాలన్నారు. అదేవిధంగా విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులు కింద కూర్చొని ఉండటాన్ని గమనించి పాఠశాలకు త్వరలో అవసరమైన బెంచీలు ఏర్పాటు చేస్తామన్నారు.మంగపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుల హాజరు,ఓపీ,రిజిస్ట్రేషన్ కౌంటర్,ల్యాబ్,ఇన్ పేషంట్ వార్డు,వ్యాక్సినేషన్ రూమ్ తదితర విభాగాలను తనిఖీ చేశారు. ఔషధ నిల్వలు రిజిస్టర్ను కలెక్టర్ పరిశీలించారు. ఔట్ పేషెంట్ విభాగంలో రోగులకు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలని,ఆస్పత్రి పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :