తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెంపు కు తక్షణమే నిర్ణయం తీసుకొని వేతనాలను పెంచాలని,కనీస వేతనాల సలహా మండలి సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి అమలుకు చర్యలు తీసుకోవాలని,నిర్లక్ష్యం విడనాడాలని సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్-AITUC కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య, ఉపాధ్యక్షులు కే డబ్ల్యూ కృష్ణఫర్ లు డిమాండ్ చేశారు. బుధవారం నాడు కొత్తగూడెం కార్పోరేట్ లోని ఇల్లందు బంగ్లోస్ వద్ద కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలని, పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాల జీవోలను సవరించి అమలు చేయడంలో, కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలను పెంచడంలో, కనీస వేతనాలు సలహా మండలి నిర్ణయించి రాష్ట్ర ప్రభుత్వా ఆమోదానికి సిఫారసు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని విమర్శించారు. రాష్ట్రంలో అత్యంత పేరు ప్రఖ్యాతలు పొందిన సింగరేణి సంస్థలో కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెరగక తీవ్ర ఆందోళన చెందుతున్నారని అన్నారు. సింగరేణి యాజమాన్యం,రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి నిధులను వాడుకోవడానికి, లాభాలను సాధించడానికి మాత్రమే కాకుండా సంస్థ లాభాలలో, సర్వీస్ లో అత్యంత కీలకంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెంపు విషయంలో నిర్లక్ష్యం విడనాడాలని,తక్షణమే వేతనాలను పెంచి అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. సింగరేణిలో 18 రోజుల సమ్మె కాలపు ఒప్పందాలు, నర్సరీ కార్మికుల కనీస వేతనాలు అమలు, ప్రైవేటు కన్వేయన్స్ డ్రైవర్ల 15% ఆడహక్కు పేమెంటు కటింగు సమస్య,అందరికీ సీఎం పిఎఫ్ అమలు చేయడం, సీఎం పిఎఫ్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి వివరాలు కార్మికులకు అందజేయడం తదితర సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని తక్షణమే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.లేనియెడల ఎఐటియుసి ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నాయకులు కృష్ణమూర్తి,చుక్కయ్య, రాజేష్,ఆదిలక్ష్మి, మణెమ్మ,రాజేశ్వరి,లక్ పతి,రాజు,సుశీల, వెంకటేశ్వర్లు,రాము,విష్ణు, సాగర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ