తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఎంపీటీసీ మరియు జెడ్పిటిసి రెండవ సాధారణ ఎన్నికల నిర్వహణ కొరకు ఈరోజు ZPHS, ఆనందఖని స్కూల్ నందు SST , FST, TOT బృందాలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ శిక్షణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎన్నికల అధికారి మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్.వి పాటిల్ పాల్గొని కార్యక్రమంలో ఎన్నికల నిర్వహణకు ముఖ్యమైన సూచనలు తెలియజేశారు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే ఉద్యోగులు ఎన్నికల కమిషనర్ నియో నిబంధనలను అనుసరించి మాత్రమే విధులు నిర్వహించాలని ఎన్నికల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. Tot 52. Fs 57 sst 38 హాజరైన వారు ఈ కార్యక్రమంలో శిక్షణ కార్యక్రమం నోడల్ ఆఫీసర్ మరియు జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీరామ్ గారుసాయికృష్ణ శిక్షణకు హాజరైన , 52 మంది TOT లు, 57మంది FST లకు, 38 మంది SST లకు శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్ ) విద్యా చందన, జిల్లా అదనపు ఎన్నికల అధికారి ( MPTC /ZPTC )మరియు జిల్లా ప్రజా పరిషత్ భద్రాద్రి కొత్తగూడెం ముఖ్య కార్యనిర్వాహణాధికారి బి.నాగలక్ష్మి , ఉపముఖ్య కార్యనిర్వాహణాధికారి కె. చంద్రశేఖర్ మరియు మాస్టర్ ట్రైనీస్ సాయికృష్ణ పాల్గొన్నారు .
Admin
తెలుగు వెలుగు టీవీ