తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం జంగంపల్లిలో హైవేపై రాంగ్ రూట్లో వచ్చిన టిప్పర్ స్కూటీని ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు చికిత్స పొందుతూ మరణించారు. మృతులలో ముగ్గురు ఖమ్మం జిల్లా బోనకల్ మండలం ముష్టికుంటకు చెందినవారు కాగా, మరొకరు ఆదిలాబాద్కు చెందిన కిషన్గా గుర్తించారు. ముష్టికుంటకు చెందిన జాస్లీన్ తన చిన్న కుమారుడు జాడ్సన్కు టీకా వేయించేందుకు తండ్రి కిషన్తో కలిసి కామారెడ్డికి వెళ్లినట్లు సమాచారం.
Admin
తెలుగు వెలుగు టీవీ