తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో సర్వర్ నిర్వహణ పనుల నేపథ్యంలో ‘మీ సేవ’ ఆన్లైన్ సేవలకు తాత్కాలిక అంతరాయం ఏర్పడనున్నట్లు ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏప్రిల్ 3వ తేదీ సాయంత్రం 5:00 గంటల నుంచి ఏప్రిల్ 5వ తేదీ ఉదయం 8:00 గంటల వరకు సర్వర్ నిర్వహణ పనులు కొనసాగనున్నట్లు వెల్లడించారు. సర్వర్ పనితీరు మెరుగుదల, భద్రతా వ్యవస్థల అప్‌గ్రేడ్, సాంకేతిక సమస్యల నివారణ కోసం ఈ నిర్వహణ చేపడుతున్నట్లు పేర్కొన్నారు.ఈ కాలంలో సంబంధిత విభాగాలకు చెందిన అన్ని ఆన్లైన్ సేవలు, డిజిటల్ లావాదేవీలు, వెబ్ పోర్టల్ సేవలు తాత్కాలికంగా నిలిపివేయబడతాయని తెలిపారు. ప్రజలు అత్యవసర సేవలను ముందుగానే వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. నిర్వహణ పూర్తయిన అనంతరం సేవలు సాధారణ స్థితికి చేరుకుంటాయని తెలిపారు. భవిష్యత్తులో వేగవంతమైన, అంతరాయం లేని సేవలను అందించేందుకు ఈ చర్యలు ఉపయుక్తమవుతాయని పేర్కొన్నారు.ఇక ‘మీ సేవ’ కేంద్రాల ద్వారా అందించే వివిధ ధ్రువపత్రాలు మరియు ఇతర సేవలకు సంబంధించిన సేవా ఛార్జీలను ప్రభుత్వం సవరించినట్లు తెలిపారు. సవరించిన ఛార్జీలు ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చాయి.ఇప్పటివరకు రూ.35గా ఉన్న కనీస సేవా ఛార్జీని రూ.62కు పెంచినట్లు తెలిపారు. ‘ఏ’ కేటగిరీ సేవలకు రూ.62 చొప్పున, ‘బీ’ కేటగిరీ సేవలకు రూ.80 చొప్పున ఛార్జీలు నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అదనంగా కరెంటు బిల్లులు, ఈ-పాస్ సేవలు, బయోమెట్రిక్ సేవలు, డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించిన సేవలకు కూడా సవరించిన ఛార్జీలు వర్తిస్తాయని వెల్లడించారు.ప్రజలు ఈ మార్పులను గమనించి సేవలను వినియోగించుకోవాలని ఆయన కోరారు.
Admin
తెలుగు వెలుగు టీవీ