తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని టీపీసీసీ జనరల్ సెక్రెటరీ నాగా సీతారాములు తెలిపారు. సింగభూపాలెం గ్రామంలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు మంచినీళ్ల జెన్ని ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అందరికీ అభివృద్ధి ఫలాలు అందుతాయి అన్నారు. కావాలనే కొందరు ఇందిరమ్మ ఇళ్ల విషయంలో రాద్ధాంతాలు చేస్తున్నారని అలాంటి వారు తమ పద్దతి మార్చుకోవాలన్నారు. పదేళ్లలో రాష్ట్రాన్ని దోచుకొని నాశనం చేసిన బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ హయంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరావు ఆధ్వర్యంలో జరుగుతున్న కొత్తగూడెం నియోజకవర్గం అభివృద్ధిని చూడాలన్నారు. ఎంపి రామసహాయం, ఎంపి రేణుక చౌదరి కూడ నియోజకవర్గ అభివృద్ధి కోసం అనేక నిధులు మంజూరు చేయించిన విషయాన్ని పునరుద్గాటించారు. గత పది ఏళ్లలో అర్హులకు రేషన్ కార్డు అందించిన ఘనత కాంగ్రెస్ కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ జిల్లా సెక్రటరీ బొబ్బాల వెంకట్ యాదవ్, సింగభూపాలం నాయకులు బైరు సాంబయ్య, పొదిల శ్రీను, చెవుల శ్రీను, కిన్నెర వెంకన్న, బూర్గు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ