Tuesday, 28 July 2026 07:55:57 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

అంతర్జాతీయ సంజ్ఞా భాషా దినోత్సవ వేడుకలు ఐ.డి.ఓ.సి. కలెక్టరేట్ నందు ఘనంగా నిర్వహించడం జరిగింది.

Date : 28 September 2025 06:36 PM Views : 326

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అంతర్జాతీయ సంజ్ఞా భాషా దినోత్సవ వేడుకలు ఐ.డి.ఓ.సి. కలెక్టరేట్ నందు ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా సంక్షేమ అధికారిణి స్వర్ణలత లేనిన కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా అంతర్జాతీయ సంకేత భాష పోస్టర్ ను ఆవిష్కరించారు . జిల్లా సంక్షేమ అధికారిణి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించడం జరిగింది అని తెలిపారు. సొసైటీలో బధిరులు ఎదుర్కొంటున్న సమస్యలు, విద్యా, ఉద్యోగాలలో బధిరులకు న్యాయం జరిగేలాగా చూస్తామని , అర్హులైన అందరికీ సహాయ ఉపకరణాలు అందిస్తామని, వారి సమస్యలు ఏమున్నా గాని తెలియజేసినట్లయితే జిల్లా కలెక్టర్ మరియు వికలాంగుల మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ డైరెక్టర్ కు సమస్యలను వివరించి సమస్యలు పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బదిరుల సంఘం జిల్లా అధ్యక్షుడు రామలింగారెడ్డి మాట్లాడుతూ బదిరులు ఎక్కడికి వెళ్లినా సంకేత భాష విషయంలో తమ సమస్యను పక్క వారికి చెప్పుకోలేక బాధలు పడుతున్నారని, అధికారులు అందరికీ సైగల భాష పై అవగాహన కల్పించాలని, రవాణా శాఖ ద్వారా బధిరులకు డ్రైవింగ్ విషయంలో లైసెన్స్ మంజూరు చేపించాలని, వికలాంగుల నియామకాలు రిజర్వేషన్లను భర్తీ చేయాలని, బధిరులకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని, మహిళలకు కుట్టుమిషన్ , కంప్యూటర్ శిక్షణలు ఇప్పించడానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బధిరుల సంఘం అధ్యక్షుడు అనిల్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ కిషన్, ఖమ్మం జిల్లా అసోసియేషన్ ఆఫ్ డెఫ్ అధ్యక్షుడు వీరస్వామి, సెక్రటరీ మహేష్ కుమార్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బదిరుల సంఘం సెక్రటరీ ఇంతియాజ్ ఖాదర్, వైస్ ప్రెసిడెంట్ లక్ష్మీ ప్రసన్న ప్రియ , అనువాదకులు అంకిత,కార్యాలయ సిబ్బంది నరేష్ , ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :