Tuesday, 28 July 2026 08:09:18 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

భగీరథ పనులను పరిశీలించిన సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె షాబీర్ పాష ,ప్రతినిధి బృందం

Date : 09 April 2026 04:32 PM Views : 250

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రామవరం ప్రాంతానికి యుద్ధ ప్రాతిపదికన మంచి నీళ్లు అందించాలి మిషన్ భగీరథ పట్ల అధికారులు అలసత్వాన్ని వీడాలి భగీరథ పనులను పరిశీలించిన సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె షాబీర్ పాష ,ప్రతినిధి బృందం కార్పొరేషన్ పరిధిలోని రామవరం ప్రాంతంలో ఉన్న నీటి ఎద్దడి నివారించేందుకు చర్యలు తీసుకొని యుద్ధ ప్రాతిపదికన మంచినీళ్లు అందించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా అధికారులకు పిలుపునిచ్చారు. గురువారం ఉదయం రామవరం లోని కిన్నెరసాని ,భగీరథ పనుల పైప్ లైన్లను, నూతన ట్యాంకులను పరిశీలించి ఆయన మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు 125 కోట్లతో మిషన్ భగీరథ పథకాన్ని మంజూరు చేయించి ప్రజలు మంచినీళ్లకు బాధపడొద్దని కృత నిశ్చయంతో చేసిన పనులకు అధికారుల అలసత్వం ద్వారా పనులు జాప్యం అవుతున్నాయని అన్నారు. తక్షణమే మిషన్ భగీరథ పనులను పూర్తి చేసి నూతన ట్యాంక్ కి నీళ్లు ఎక్కించి రామవరం లో నీటి ఎద్దడి లేకుండా చూడాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అధికారులకు ఫోన్లో ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. అలాగే పాత కిన్నెరసాని ట్యాంక్ ద్వారా సాయంత్రానికి నీళ్లు అందించాలని అధికారులకు ఆదేశించినట్లు ఆయన తెలిపారు. అలాగే స్టాండ్ బై మోటార్లను ఏర్పాటు చేసుకొని మంచినీటి సరఫరా లో అవాంతరాలు ఏర్పడకుండా చూసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు .అలాగే పైప్ లైన్ జరుగుతున్న ప్రాంతాల్లో శిథిలమైన రోడ్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు అసౌకర్యం లేకుండా చూడాలని మిషన్ భగీరథ అధికారులను ఆయన ఆదేశించారు పనులను పరిశీలించిన సిపిఐ ప్రతినిధి బృందంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మునిగడప వెంకటేశ్వర్లు, జిల్లా కౌన్సిల్ సభ్యులు భూక్య శ్రీనివాస్, రామవరం బ్రాంచ్ కార్యదర్శి మర్రి గోపి, త్రీ టౌన్ టౌన్ ఏరియా కార్యదర్శి యూసుఫ్, 14,16,17 వ డివిజన్ కార్పొరేటర్స్ సుధాకర్ రాజు, మునిగడప పద్మ, ఎర్రబెల్లి శంకర్, సీనియర్ నాయకులు మాటేటి గోపాల్, సర్పంచ్ నగేష్, రమేష్, అంకుష్ గంటాడి కోటేశ్వరరావు, ఖంపెల్లి దుర్గయ్య, నాగరాజు, శివ ,రాజు ,జగ్గు, చందు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :