తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు మండలంలోని ఎన్నికలు జరిగిన అన్ని గ్రామపంచాయతీలలో 22-12-2025 సోమవారం రోజున గ్రామపంచాయతీ మొదటి సమావేశం నిర్వహించబడుతుంది.ఈ సమావేశంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు మరియు వార్డు సభ్యుల ప్రమాణస్వీకారం తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ చట్టం–2018 ప్రకారం జరుగుతుంది.ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని సంబంధిత ప్రత్యేక అధికారి / అధికారిక అధికారి లేదా గ్రామపంచాయతీ కార్యదర్శి నిర్వహిస్తారు. అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయవలసిందిగా గ్రామపంచాయతీ కార్యదర్శులకు మండల అభివృద్ధి అధికారి పూరేటి అజయ్ ఆదేశాలు జారీ చేయబడినవి.ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించి కార్యక్రమాన్ని శాంతియుతంగా విజయవంతం చేయాలని కోరారు
Admin
తెలుగు వెలుగు టీవీ