తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం కార్పొరేషన్లో సీపీఐకి మద్దతు ఇస్తామని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. సింగరేణిలో జరుగుతున్న బొగ్గు కుంభకోణాలను అడ్డుకోవాలంటే కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని, ఈ మేరకు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో చర్చించినట్లు తెలిపారు. కాంగ్రెస్, బీజేపీల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడమే లక్ష్యంగా ఈ ప్రతిపాదన చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. కొత్తగూడెంలో హంగ్ వచ్చిన విషయం తెలిసిందే.
Admin
తెలుగు వెలుగు టీవీ