తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : దసరా శరన్నవరాత్రి సందర్బంగా టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు కు ఆలయ మర్యాదలతో పెద్దమ్మతల్లి గుడి అధికారులు స్వాగతం పలికారు. పాలకమండలి చైర్మన్ బాలినేని నాగేశ్వరావు, డైరెక్టర్లు చీకటి. కార్తీక్,శనిగారపు.శ్రీనివాసరావు,చెవుగాని.పాపారావు,భుక్యా.గిరిప్రసాద్ లతో కలిసి అమ్మవారిని దర్శించుకున్న నాగా సీతారాములు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోరిన కోరికలు తీర్చే తల్లిగా పేరున్న కనకదుర్గమ్మ అమ్మవారిని దసరా శరన్నవరాత్రి సందర్బంగా దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని నాగా సీతారాములు అన్నారు. కనకదుర్గమ్మ ఆశీస్సులు అందరిపై ఉండాలని, తండోపతండాలుగా అమ్మవారి ఆశీర్వాదం కోసం కఠోర దీక్షతో భక్తులు తరలివస్తున్నారని అన్నారు. అమ్మవారి దృష్టిలో అందరూ ఒక్కటేనని చెప్పుకొచ్చారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంపై అమ్మవారి కరుణ కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలి కోరుకున్నారు. దసరా సందర్బంగా భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన పాలకమండలి, ఆలయ సిబ్బంది, అధికార యంత్రాంగంపై ప్రసంశలు కురిపించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు మంచి ఏర్పాట్లు చేశారని, సామాన్య భక్తులు కూడా అమ్మవారిని సజావుగా దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయడం అభినందనీయమని కొనియాడారు. ఆయన వెంట ఓబీసీ జిల్లా సెక్రటరీ బొబ్బాల వెంకట్ యాదవ్, కొత్తగూడెం టౌన్ ప్రెసిడెంట్ జయప్రకాశ్, రవికాంత్, యువజన కాంగ్రెస్ జిల్లా నాయకులు అశోక్, వెంకటేశ్వర్లు,రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ