Tuesday, 28 July 2026 12:44:06 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

సభ్యుల సొమ్మును సక్రమంగా వినియోగించాలి – డి ఆర్ డి ఓ విద్యా చందన.

Date : 12 November 2025 06:38 PM Views : 210

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సభ్యుల సొమ్మును సక్రమంగా వినియోగించాలి అని, సంఘం తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించాలని డిఆర్డివో విద్యా చందన అన్నారు. జిల్లాలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) ఆధ్వర్యంలో సీనియర్ CRP స్ట్రాటజీ కార్యక్రమం కింద జిల్లాలోని అన్ని మండలాల్లో గ్రామ సంఘాలు (VOs) మరియు మండల సమాఖ్యలు (MS) పనితీరును సమీక్షించేందుకు మొత్తం 10 మంది సీనియర్ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్‌ (CRPs) గత 15 రోజులుగా విస్తృత పర్యటన చేపట్టారు.గత నెల 28వ తేదీ నుండి ఈ నెల 11వ తేదీ వరకు నిర్వహించిన పర్యటన అనంతరం బుధవారం ఐడి ఓ సి కార్యాలయం సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు . ఈ సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ (DRDO, DRDA) ఎం. విద్యా చందన పాల్గొని CRPలు సమర్పించిన నివేదికలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ — “గ్రామ సంఘాలు, మండల సమాఖ్యలు తీసుకున్న బాధ్యతలను కట్టుబాట్లతో పాటిస్తూ, తీసుకున్న రుణాలను సమయానికి తిరిగి చెల్లించాలి. పుస్తక నిర్వహణను క్రమబద్ధంగా కొనసాగిస్తూ సభ్యుల సొమ్మును సక్రమంగా వినియోగించాలి. ఎక్కడా కూడా నిధుల దుర్వినియోగం జరగకుండా పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాలి” అని సూచించారు. సంఘ సభ్యులు శిక్షణా కార్యక్రమాల ద్వారా అవగాహన పెంపొందించుకొని స్వయం సమృద్ధి దిశగా ముందుకు సాగాలని, సీనియర్ CRPలు తగిన మార్గదర్శకతతో గ్రామ స్థాయిలో ఉన్న లోటుపాట్లను సరిదిద్దేలా కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అదనపు డి ఆర్ డి ఓ నీలేష్, జిల్లా సమాఖ్య అధ్యక్షులు సుజాత , డిపిఎం సి.హెచ్. అనూరాధ , సీనియర్ CRPలు, అన్ని మండలాల APMలు, VO అధ్యక్షులు, CCలు, VOAలు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :