Tuesday, 28 July 2026 10:47:04 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

మెడికల్ బోర్డు నిర్వహించి కార్మికులను ఆదుకోండి ,మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

Date : 23 July 2025 07:26 PM Views : 850

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సింగరేణి సంస్థలో తక్షణమే మెడికల్ బోర్డు నిర్వహించి కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, టీబీజీకేఎస్ ఇంచార్జ్ కొప్పుల ఈశ్వర్ నేతృత్వంలో బిఆర్ఎస్, టీబీజీకేఎస్ ప్రతినిధి బృందం చేసిన విజ్ఞప్తికి సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం సానుకూలంగా స్పందించారు. బుధవారం హైదరాబాదులోని సింగరేణి భవన్ లో సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించారు. గడిచిన సంవత్సరం కాలంగా మెడికల్ బోర్డులో హయ్యర్ సెంటర్ కు రిఫరల్ కాబడిన రోగులను అన్ ఫిట్ చేయకపోవడం, విధులకు అనుమతించకపోవడం వలన ఆర్థికంగా, మానసికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చైర్మన్ కు వివరించారు. సింగరేణి కార్మికులకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని, వైద్యశాలల్లో బిపి, షుగర్ తో పాటు అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచాలని కోరారు. సింగరేణి పరిశ్రమను కాపాడుకోవడానికి కొత్త బొగ్గు గనులు ప్రారంభించడానికి తక్షణమే కార్యచరణ రూపొందించాలని విజ్ఞప్తి చేశారు. భూగర్భ గనులు, ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులలో అవసరమైన యంత్రాలను తక్షణమే కొనుగోలు చేసి ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుకు కృషి చేయాలని అన్నారు.. పాత యంత్రాలతో బొగ్గు ఉత్పత్తి చేయటం వలన కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. ఉత్పత్తి లక్ష్యసాధనలో వెనుకబడిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. సింగరేణి సంస్థ మునుగడకు అభివృద్ధికి దోహదపడే పలు ఇతర రంగాలపై దృష్టి పెడుతున్నట్లు సింగరేణి సిఎండి వివరించారు. కార్మిక సంక్షేమం యధావిధిగా కొనసాగాలంటే ఉత్పాదకత పెంచుకోవాలని వివరించారు. గత సంవత్సరం సింగరేణి సంస్థ సాధించిన లాభాలను ప్రకటించి వెంటనే వాటా చెల్లించాలని ప్రతిపాదించగా ఆయన గతం కంటే ఎక్కువ లాభాలే వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు హరిప్రియ నాయక్, పుట్ట మధు, కోరు కంటి చందర్, దుర్గం చిన్నయ్య, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్త, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మిరియాల రాజిరెడ్డి, ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామమూర్తి పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :