తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం శ్రీ పాండురంగ భజనమందిరంలో శ్రీ షిరిడి సాయిబాబా, శ్రీ కుసుమ హరినాధ బాబా దేవాలయంలో ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ఈ నెల 31వ తేదీ నుండి ఏప్రిల్ 2వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మూడు రోజుల పాటు విశేష పూజలు, అభిషేకాలు, అలంకరణలు నిర్వహించబడతాయి. ఏప్రిల్ 2వ తేదీ గురువారం ఉదయం 108 కలశాలతో మహాభిషేకం, పుష్పాలంకరణ కార్యక్రమాలు జరుగుతాయి. మధ్యాహ్నం 1 గంటకు అన్నప్రసాదం భక్తులకు పంపిణీ చేయబడుతుంది. ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు భజన కార్యక్రమం, రాత్రి 9 గంటలకు హారతి అనంతరం తీర్థ ప్రసాదం అందించబడుతుంది. ఈ పవిత్ర కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని దేవాలయ నిర్వాహకులు కోరుతున్నారు. మరిన్ని వివరాలకు రమణ పూజారి (ఫోన్: 9000799020)ను సంప్రదించగలరని తెలియజేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ