Tuesday, 28 July 2026 08:09:54 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

గుండె, లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఉద్యమ నాయకురాలు మంజుల -ఆ కుటుంబానికి అండగా ఉందాం..! - టీఎన్జీవో అధ్యక్షులు వెంకట పుల్లయ్య సాయం

Date : 18 July 2025 07:57 PM Views : 604

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం జిల్లా కేంద్రం లోని రైటర్ బస్తి ఏరియాలో పేద కుటుంబానికి చెందిన దళిత, నేతకానీ మహిళా జాడి మంజుల గత కొంత కాలంగా గుండె, లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. మంజుల చిన్న తనం నుండే చాలా చురుకుగా, చదువుల్లో కూడా ముందుఉంటూ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారు. తర్వాత తల్లిదండ్రులను కోల్పోయి, అయినవారు అందరూ ఉన్నా, విద్యార్థి సంఘం పిడిఎస్యు పనిచేసి, పి ఓ డబ్ల్యు మహిళా సంఘం లో పనిచేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో అన్ని కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ తనదైన ముద్ర వేసుకున్నారు. విద్యా సంస్థలో ఏ సమస్యలున్నా, విద్యార్థుల తరఫున గాని తల్లిదండ్రులు తరఫున గాని ఎట్లాంటి ఇబ్బందులు కాకుండా చూసుకున్నటువంటి వ్యక్తిత్వం ఆమెది. విద్యాసంస్థల యాజమాన్యాలు కూడా మంజుల చాలా సుపరిచితురాలు. అనంతరం తెలంగాణ ఉద్యమ సమయంలోనే తెలంగాణ ధూమ్ ధామ్, జానపద కళాకారుడు,విద్యార్థి, ఉద్యమ కారులు కొండ జంపన్న ను పెళ్లి చేసుకున్నారు. తర్వాత ప్రస్తుతం కొత్తగూడెంలో భర్త కొండ జంపన్న తో కలిసి ఉంటున్నారు. జంపన్న జర్నలిస్ట్ గా (మనం పత్రిక) కొత్తగూడెం లో పని చేస్తున్నారు.బాబు పుట్టిన తర్వాత ఈ సమస్య ఉత్పన్నమైంది. భర్త జంపన్న,తోబుట్టువులు, కలిసి చేతనైన కాడికి వైద్యం చేయిస్తున్నారు. వైద్య ఖర్చులు, మందులు భారం అవుతుండడంతో స్తోమత లేక ఎదురు చూస్తుండగా నెల క్రితం టీఎన్జీవో అధ్యక్షులు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంగం వెంకట పుల్లయ్య కు విషయం చెప్పగా వెంటనే స్పందించి హైదరాబాద్ లో ఉన్న మహావీర్ హాస్పిటల్ కు స్వయంగా దగ్గర ఉండి పంపించారు. మీడియా యూనియన్ నాయకులు, మనం పత్రిక బృందం, స్నేహితులు చరవాణి ద్వారా ఆశ్రయించి సాయం కోరగా స్పందించిన వారు పూర్తి వివరాలు తెలుసుకుని ధైర్యం చెప్పి వారి సభ్యులందరి తరపున వైద్య ఖర్చులు, మందుల నిమిత్తం ఆర్థిక సాయాన్ని ఫోన్ పే ద్వారా మరియు ప్రత్యక్షంగా అందించారు. సాయం పొందిన మంజుల వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం మంజుల హైదరాబాద్ లోని మహావీర్ ఆసుపత్రిలో చికిత్స పొందు తున్నారు. చికిత్స కోసం, పరీక్షలు, మందుల కోసం వారికి ఆర్థికంగా తోడ్పాటు అందించిన వారు మాట్లాడుతూ తోటి ఉద్యమ మిత్రులు, శ్రేయోభిలాషులు, సామాజిక, రాజకీయ,ప్రజా సంఘాల నాయకులు మానవత్వంతో స్పందించి మహిళ ఉద్యమకారురాలు మంజులని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తమకు తోచినంత సాయం చేయాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు. సాయం చేయదలచిన వారు ఫోన్ పే, గూగుల్ పే నెంబర్ కొండా జంపన్న-మంజుల 9640542368, 9704732305 కి పంపించాలని విజ్ఞప్తి చేశారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :